లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

మిస్టరీ : మానవ సంచారం లేని ఎడారిలో లోహపు స్తంభం..

Published

on

America : Stainless steel bar mystery in the Utah Desert : మానవ సంచారం లేని ప్రాంతంలో అచ్చం మనుషులు చేసినట్లుగా ఉన్న ఓ లోహపు స్తంభం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఓ ఎడారిలో కనిపించిన ఆ లోహపు స్తంభం అనుమానాలను రేకెత్తిస్తోంది.అమెరికాలోని ఉటా ఎడారిలో ఇటీవల ఓ లోహపు స్తంభం దర్శనమిచ్చింది. దాన్ని చూసివారంతా ఆశ్చర్యపోతున్నారు? దాన్ని ఆ ఎడారిలో ఎవరు పెట్టారు. ఎలా పెట్టారు? అసలు ఎందుకు ఆ ఎడారిలో దాన్ని పెట్టాల్సిన అవసరమేంటి? అనే ప్రశ్నలు బుర్రల్ని తొలిచేస్తున్నాయి.ఉటా లోని నిర్జన రెడ్ రాక్ ఎడారిలో సుమారు 12 అడుగుల పొడవున్న ఆ లోహపు స్తంభం (pillar) ఎక్కడ్నించి వచ్చిందనే విషయం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఉటా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో ధగధగ మెరిసిపోతున్న ఆ లోహపు స్తంభం కనిపించడం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఆగ్నేయ ఉటాలో పొట్టేళ్ల కోసం హెలికాప్టర్ సర్వే నిర్వహిస్తుండగా ఈ ఎండలో ధగధగా మెరిసిపోతున్న లోహపు స్తంభం దర్శనమిచ్చింది.పులి నుంచి తప్పించుకున్నాడు..వీడియో వైరల్దాంతో కిందికి దిగిన ప్రభుత్వ సిబ్బంది దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువుగా దానిని గుర్తించారు. దాన్ని అక్కడికి ఎవరైనా తీసుకువచ్చారా అంటే అందుకు తగ్గ ఆనవాళ్లు అక్కడేమీ లేవు. దాంతో వారు మరింత విస్మయానికి గురయ్యారు. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వ అధికారులు విచారణ చేస్తున్నారు.ఈ లోహపు దిమ్మెను ఎలా కనిపెట్టారంటే..
ఉటా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సేఫ్టీవారు అడవి గొర్రెల సంతతిని లెక్కపెట్టడానికి హెలికాఫ్టర్‌లో వెళ్లారు. ఆ సమయంలో వారికి ఈ లోహపు స్తంభం కనిపించింది.. ఉటా నైరుతి దిక్కున ఎర్రరాళ్ల మధ్య ఇది ఉంది.. ఆ లోహపు స్తంభం అక్కడికి ఎలా వచ్చిందో, తెచ్చిన వారు ఎలా తెచ్చారో అధికారులకు కూడా తెలియటంలేదు.సినిమా సీన్ గుర్తుచేస్తున్న లోహపు దిమ్మె
పోనీ ఎవరైనా పాతిన ఆనవాళ్లు ఉన్నాయా అంటే అవి కూడా లేవు. ఈ లోహపు స్తంభం 1968లో విడుదలైన 2001 ఎ స్పేస్‌ ఒడెస్సీ సినిమాలో ఉన్న మాదిరిగానే ఉందని అంటున్నారు. అందుకే అందరికీ దీనిపై ఆసక్తి పెరిగింది. ఆ సినిమాలో గ్రహాంతరవాసుల నిర్మాణం అచ్చంగా ఇలాగే ఉంటుంది. అయితే అధికారులు మాత్రం ఈ దిమ్మె గురించి ఎటువంటి విషయాలు వెల్లడించటంలేదు.సీక్రెట్ గా ఉంచుతున్న అధికారులు
ఎందుకంటే..ఏదైనా వింత గురించి తెలిస్తే చాలు జనాలు ఎగేసుకుని వెళ్లిపోతారు. అదేంటో చూసేసి..తెగ వైరల్ చేసేయటానికి రెడీగా ఉంటారు. దీంతో అసలు విషయం పక్కకుపోయి ఎవరికి తోచింది వారు చెప్పేస్తుంటారు. దీంతో గందరగోళం నెలకొంటుంది.మరో విషయం కూడా ఏమిటంటే..ఆ లోహపు స్తంభం ఉన్న ప్రాంతం వెళ్లాలంటే చాలా సమస్యలతో కూడుకున్నది. మనుషులు వెళ్లలేని ప్రాంతం..అలా ఎవరైనా సాహాసం చేసి వెళితే అక్కడే చిక్కుకుపోవడం ఖాయం దీంతో లేనిపోని చిక్కులు..కొత్త కొత్త తలనొప్పులు వస్తాయి. అందుకే అధికారులు దాన్ని సిక్రేట్‌ గానే ఉంచుతున్నారు.ఇదంతా కాదు కానీ మానవ సంచారం లేని ఆ ఎడారిలో ఆ లోహపు దిమ్మె ఉండటానికి గల కారణాలను కనిపెట్టి అసలు విషయం చెప్పేస్తే తేల్చస్తే ఏ సమస్యా ఉండదు.జనాలు ఎవరి పని వాళ్లు చూసుకుంటారు. మరి ఈ లోహపు స్తంభం మిస్టరీ ఎప్పటికీ వీడుతుందో చూడాలి!

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *