60 ఏళ్ల అల్జీమర్స్‌ బామ్మకు డ్యాన్స్ ను గుర్తు చేసిన మ్యూజిక్..వైరల్ వీడియో

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

America : Alzheimer’s Woman reminiscences ballet dance : అల్జీమర్స్ తో బాధపడి తన అపురూపమైన గతాన్ని మరచిపోయిన ఓ బామ్మకు ఓ మ్యూజిక్ ఆమెతో నూతన ఉత్సాహాన్ని కలిగించింది. తాను యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఓ అద్భుతమైన డ్యాన్సర్ నని గుర్తుచేసింది. ఆ మ్యూజిక్ విన్న ఆ బామ్మగారు సంతోషంగా పొంగిపోయింది. ఉత్సాహంగా చేతులు కదిపింది. తన గతాన్ని గుర్తుచేసుకుని సంతోషపడిపోయింది. కుర్చీలో కూర్చునే చేతులు కదుపుతూ ఉత్సాహంగా డ్యాన్స్ వేసిన వీడయో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వివరాల్లోకి వెళితే..అమెరికాకు చెందిన డ్యాన్సర్ మార్తా సి గొంజాలెజ్. అద్భుతమైన డ్యాన్సర్. ఆమెకు ఇప్పుడు 60 ఏళ్లు. అల్జీమర్స్ తో బాధపడుతోంది. వాలెన్సియాలోని ఒక సంరక్షణ గృహంలో వీల్ చైర్ కే పరిమితం అయిపోయింది. తనballet డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించేదాన్ననే విషయం కూడా మరచిపోయింది.మార్తా యుక్త వయస్సులో ఉండగా తన బుట్టబొమ్మలాంటి ఫ్రాక్ వేసుకుని అందాలు చిందే తన అద్భుత లావణ్యంతో డ్యాన్స్ వేస్తూ అందరిలోనూ ఉత్సాహాన్ని కలిగించేది. అయితే, వయసు పెరగడంతో ఆమెకు అల్జీమర్స్ వ్యాధి వచ్చింది. ఆ మతిమరుపుతో అన్ని మరచిపోయింది తనకు ప్రాణమైన ballet డ్యాన్స్ తో సహా.ఈక్రమంలో ఓరోజు ఆమెకు హెడ్ సెట్ పెట్టి మ్యూజిక్ ను ఆన్ చేసి పెట్టడంతో గతంలో తాను చేసిన డ్యాన్స్ ఆమెకు గుర్తుకు వచ్చింది. ఆనందంతో ఆమె ముఖం విప్పారింది. డ్యాన్స్ ఆమె ముఖంలో తాండవించింది. మెల్లగా చేతులు కదపటం ప్రారంభించింది. మ్యూజిక్‌కు అనుగుణంగా చేతులను కదిలిస్తూ డ్యాన్స్ చేసింది. అమెరికాకు చెందిన మాజీ డ్యాన్సర్ మార్తా కు సంబంధించిన ఆఖరి డ్యాన్స్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ వీడియో లో 2019లోనే తీసినా దీన్ని మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది వైరల్ అవుతోంది. అనారోగ్య కారణాలతో మార్తా 2019తోనే కన్ను మూసింది. ఇదే ఆమె చివరి డ్యాన్స్ అని తెలుస్తోంది. చలనం లేని వారిని కూడా కదిలించే శక్తి మ్యూజిక్, డ్యాన్స్ కి ఉందనే విషయం మరోసారి రుజువైంది. నటుడు ఫర్హాన్ అక్తర్ ఇన్ స్టా గ్రామ్ లో ఈ వీడియో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Farhan Akhtar (@faroutakhtar)

Related Tags :

Related Posts :