లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ట్రంప్ వర్సెస్ బైడెన్ : ఏ రాష్ట్రంలో… ఎంత ఆధిక్యత?

Published

on

US presidential election : అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. వైట్ హౌస్ లో కొలువుదీరేది డెమొక్రాట్లా? రిపబ్లికన్లా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రత్యర్థి జో బైడెన్ మధ్య కొనసాగుతున్న హోరా హోరీ పోరులో గెలుపు ఎవరి సొంతమవుతుందోనని ప్రపంచం మొత్తం ఆసక్తిగా
ఎదురుచూస్తోంది.ఏడు రాష్ట్రాల్లో కౌంటింగ్
మ్యాజిక్ ఫిగర్ కు 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు జరిగిన లెక్కింపులో డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కు 238 ఎలక్టోరల్ ఓట్లు రాగా రిపబ్లిక్ అభ్యర్థి ట్రంప్ కు 213 ఎలక్టోరల్ ఓట్లు వచ్చినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఏడు రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.ట్రంప్ 213
అలబామా 9, అర్కన్ సన్ 6, ఫ్లోరిడా 29, ఇదహో 4, ఇండియానా 11, అయోవా 6,
కాన్సాస్ 6, కెంటకీ 8, లూసియానా 8, మిసిసిపి 6, మిస్సోరి 10, మాంటానా 3, నెబ్రాస్క 4, నార్త్ డకోటా 3, ఒహైయో 18, ఒక్లహామా 7, సౌత్ కరోలినా 9, సౌత్ డకోటా 3, టెన్నీసె 11, టెక్సాస్ 38, ఉతా 6, వెస్టు వర్జీనియా 5, వ్యోమింగ్ 3
రాష్ట్రాల్లో ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి.జోబైడెన్ 238
ఆరిజోనా 11, కాలిఫోర్నియా 55, కొలరాడో 9, కనెక్టికట్ 7, డెలావర్ 3, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా 3, హవాయి 4, ఇల్లినాయిస్ 20, మెయిన్ 3, మేరీల్యాండ్ 20, మసాచుసెట్స్ 11, మిన్నెసోటా 10, నెబ్రాస్కా 1, న్యూహ్యాంపి షైర్ 4, న్యూ జెర్సీ 14, న్యూ మెక్సికో 5, న్యూయార్క్ 29, ఓరిగాన్ 7, రోడ్ ఐలండ్ 4, వెర్మోంట్ 3, వర్జీనియా 13, వాషింగ్టన్ 12 రాష్ట్రాల్లో ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. అలస్కా, జార్జియా, మిషిగాన్, నెవాడ, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఇంకా ఫలితం తేలాల్సివుంది.మిషిగన్ ఫలితంపై ఉత్కంఠ
మిషిగన్ రాష్ట్రంలో ట్రంప్, బైడెన్ మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది . ఇక్కడ ట్రంప్ కేవలం 1.4 శాతం ఆధీక్యంతో కొనసాగుతున్నారు. అయితే ఇంకా 10 లక్షల డెట్రాయిట్ ఓట్లు లెక్కించాల్సి ఉంది. డెట్రాయిట్ ప్రాంతంలో డెమొక్రాట్లకు బాగా పట్టుంది. ఈ నేపథ్యంలో మిషిగన్ 16, ఫలితంపై రెండు పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు జార్జియా, నెవాడలలో కౌంటింగ్ ను నిలిపివేశారు. జార్జియాలో ఇప్పటికే 92 శాతం
ఓట్ల లెక్కింపు పూర్తి అయింది.నెవాడా 4 ఫలితంపై తీవ్ర ఉత్కంఠ
ఇంకా లక్షా 27 వేల ఓట్లు లెక్కించాల్సివుంది. ఇక్కడ ట్రంప్ కు లక్ష ఓట్ల మెజార్టీ ఉంది. మరో వైపు నెవాడలో ఓట్ల లెక్కింపు నిలిపివేయడంతో ఫలితం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒకటి కంటే తక్కువ శాతం ఓట్లు
ఆధిక్యంలో బైడెన్ కొనసాగుతున్నారు. నెవాడా 4 ఫలితంపై
ఇరు పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *