Home » ఈ మాస్క్ ను 20 సార్లు ఉతికినా ఏం కాదు..Novel mask
Published
4 months agoon
By
madhunovel mask, developed by scientists : కరోనా నేపథ్యంలో మాస్క్ కంపల్సరీ అయిపోయింది. కానీ..దీనిని వాడడంలో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. మాస్క్ లు కూడా ఖరీదుగా ఉంటుడడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ధరించిన సమయంలో..మాస్క్ లు కిందకు జారిపోవడం, ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలు ఏర్పడుతున్నాయి.
ఇక కళ్లద్దాలు ఉన్న వారు ఇబ్బందులు చెప్పనక్కర్లేదు. దీంతో కొన్ని సంస్థలు వెరైటీ మాస్క్ లు తయారు చేసి మార్కెట్ లో విడుదల చేస్తున్నారు. ఇలాగే అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త మాస్క్ ను డిజైన్ చేశారు. రోజంతా ధరించేలా, సౌకర్యవంతంగా ఉండేలా దీనిని తయారు చేసినట్లు టెక్స్ టైల్ ఇనిస్టిట్యూట్ కు చెందిన జర్నల్ ప్రచురించింది.
జార్జియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Georgia Institute of Technology) దీనిని తయారు చేశారు. ఈ మాస్క్ లో ఉన్న పాకెట్ ద్వారా అదనపు లేయర్ ధరించి భద్రత పొందే అవకాశం ఉందని వెల్లడించారు. దాదాపు 20 సార్లు ఉతికినా..అది సాగడం గాని, నాణ్యత తగ్గడం ఉండదన్నారు.