పిల్లలకు డ్యాన్స్ నేర్పుతున్న తల్లి పక్షి..స్టెప్పులు అద్ధరగొట్టేశాయిగా..!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఓ తల్లి పక్షి తన చిన్నారి పిల్లలకు ఎలా బతకాలో..ఆహారం ఎలా సంపాదించుకోవాలో..ప్రమాదాలు వస్తే ఎలా తప్పించుకోవాలో నేర్పిస్తుంటుంది. కానీ ఓ తల్లి పక్షి తన పిల్లలకు ఏకండా డ్యాన్స్ నేర్పిస్తోంది. ఏంటీ పక్షి డ్యాన్స్ చేయటమా? పిల్ల ప‌క్షుల‌కు ఆహారాన్ని అందించ‌డ‌మే కాదు.. వాటికి డాన్స్ కూడా నేర్పిస్తుంద‌ని మీకు తెలుసా? ఓ తల్లి పక్షి తన రెండు పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్న వీడియో ఒక‌టి ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

తల్లిప‌క్షి వ‌య్యారంగా ఊగుతూ, త‌న పిల్ల ప‌క్షుల‌కు అద్భుత‌మైన డాన్స్ నేర్పిస్తోంది. బ్యూటెంగేబీడెన్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక‌ అమెరికన్ వుడ్‌కాక్‌ తన పిల్లలకు ఏదో నేర్పుతుండ‌గా, అవి త‌ల్లి ఎలా చెబుతోందో అలానే చేస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు ఎంతో ముచ్చ‌ట‌ప‌డిపోతున్నారు. ఆ ప‌క్షుల వ‌య్యార‌మైన‌ క‌ద‌లిక‌ల‌కు అనుగుణంగా ఈ వీడియోలో మ్యూజిక్‌ను కూడా జ‌త‌చేయటంతో ఆ పక్షుల డ్యాన్స్ మరింత అద్భుతంగా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది . మరి మీరు కూడా ఓ లుక్ వేయండా మరోసారి లుక్ వేయకుండా ఉండలేని గ్యారంటీ..

మామూలుగా ఒక ప‌క్షి త‌న పిల్ల‌ల‌ను సాకే దృశ్యం కంట‌ప‌డితే… ఎవ‌రైనా స‌రే అలా చూస్తూనే ఉండిపోతారు. వారికి అది ఒక అద్భ‌తంగా కనిపించే ఆ దృశ్యాన్ని కళ్లార్పకుండా చూస్తుంటాం. అటువంటి పిల్లలకు డ్యాన్స్ నేర్పుతున్న తల్లి..అమ్మ వేసే స్టెప్పులకు అనుగుణంగా సరిగ్గా అలాగే వేసే ఆ బుజ్జి పక్షిపిల్లల స్పెప్పులు చూసి తీరాల్సిందే..

Related Posts