లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

కేబీసీ ఇద్దరిని కలిపింది : ఒకే గూటికి భార్యాభర్తలు

Published

on

Amitabh Bachchan’s appeal on KBC 12 : బిగ్‌ బీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌ పతి కార్యక్రమం ద్వారా మూడేళ్లుగా దూరంగా ఉంటున్న భార్యభర్తలు ఒకే గూటికి చేరారు. కేబీసీ (KBC) 12వ సీజన్‌లో వివేక్‌ పార్మర్‌ అనే కానిస్టేబుల్‌ హాట్ సీట్‌ వరకు వచ్చాడు. అమితాబ్‌తో జరిపిన సంభాషణలో తాను, తన భార్య ఇద్దరం పోలీస్‌ కానిస్టేబుళ్లగా పని చేస్తున్నట్టు చెప్పాడు. అయితే తాను మంద్‌సార్‌ పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తుంటే భార్య గ్వాలియర్‌లో పని చేస్తుందని చెప్పాడు.

ఈ రెండు ప్రాంతాల మధ్య వందల కిలోమీటర్ల దూరం ఉందన్నాడు. మూడేళ్లుగా తాము కలిసి ఉన్నది తక్కువ సమయం అని చెప్పాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తమకు మరో మార్గం లేకుండా పోయిందని చెప్పాడు వివేక్‌. హాట్ సీట్‌పై ఉన్న కానిస్టేబుల్‌ వివేక్‌ చెప్పిందంతా విన్న బిగ్‌ బీ స్పందించారు. భార్యభర్తల కష్టాలను చూసి.. వారిని కలిపే విధంగా మధ్యప్రదేశ్‌ సర్కార్‌ ఏమైనా చేయాలంటూ అభ్యర్థించారు కేబీసీ షోలో అమితాబ్‌.

అమితాబ్‌ అభ్యర్థనకు స్థానిక ఎమ్మెల్యే యష్‌పాల్ సిసోడియా స్పందించారు. గ్వాలియర్‌లో పని చేస్తున్న వివేక్‌ భార్యను మంద్‌సార్‌కు బదిలీ చేయాలని కోరుతూ మధ్యప్రదేశ్‌ డీజీపీని కోరారు. దీనికి స్పందించిన పోలీస్‌ బాస్‌… వివేక్‌ భార్యను మంద్‌సార్‌కు బదిలీ చేశారు.