భారత్ లో కార్యకలాపాలు నిలిపేస్తున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్… ప్రభుత్వ వేధింపులే కారణం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Amnesty International-halts work in India అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ… ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత్ లో తన కార్యకలాపాలను నిలిపివేయనుంది. మానవ హక్కుల సంఘాలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆమ్నెస్టీ ఆరోపించింది.దేశంలో తమ బ్యాంకు ఖాతాలన్నిటినీ అప్రజాస్వామికంగా స్తంభింప జేశారని.. తమ సిబ్బందిని తొలగించాల్సి వచ్చిందని, తమ సంస్థ ప్రచారాలను, పరిశోధనా కార్యక్రమాలన్నిటినీ నిలిపేయాల్సి వచ్చిందనీ అమ్నెస్టీ ఇండియా ఆరోపించింది. ఈ నేపథ్యంలో భారత్ లో కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.


ప్రభుత్వం నుంచి ఒక క్రమపద్ధతిలో బెదిరింపులు, దాడులు, వేధింపులను ఆమ్నెస్టీ ఎదుర్కుంటోందని ఆ సంస్థ సీనియర్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్, అడ్వకసీ అండ్ పాలసీ రజత్ ఖోస్లా తెలిపారు. మానవహక్కుల ఉల్లంఘనపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు స్పందించడం ప్రభుత్వానికి ఇష్టం లేదని,ఢిల్లీ అల్లర్లతో పాటు జమ్మూ కశ్మీర్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పడంలేదని ఆయన అన్నారు. భారత్‌లో ఇక తాము సేవలనందించలేమని స్పష్టం చేశారు. మొత్తం 70 కి పైగా దేశాలలో పనిచేస్తున్న తాము… 2016 లో రష్యాలో మాత్రమే కార్యకలాపాలను నిలిపేసినట్లు వెల్లడించారు. తాజాగా… భారత్‌లో కూడా కార్యకలాపాలను నిలిపివేసినట్లు చెప్పారు. న్నామని చెప్పారు. ఇక… ఆయా కేసులపై మాత్రం పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.


అయితే, 2009లో కూడా ఒకసారి అమ్నెస్టీ, ఇండియాలో తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. విదేశాలనుంచీ నిధులను స్వీకరించడానికి అవసరమైన లైసెన్సును మళ్లీ మళ్లీ తిరస్కరిస్తున్నారని అందుకే అప్పట్లో తమ సంస్థ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు అమ్నెస్టీ తెలిపింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది.

కాగా, అమ్నెస్టీ సంస్థ గత కొన్నేళ్లుగా ప్రభుత సంస్థల సోదాలను ఎదుర్కుంటోన్న విషయం తెలిసిందే. ఈ నెలలో బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయటం వేధింపులలో చిట్టచివరి అంకమని ఆ సంస్థ అభివర్ణించింది. ఇంతకుముందు 2016లో ఒక కార్యక్రమంలో భారత వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై అమ్నెస్టీ ఇండియా మీద దేశద్రోహం కేసు నమోదు చేశారు. మూడేళ్ల తరువాత కోర్టు ఆ అభియోగాలను తొలగించాలని ఆదేశించింది.


2018లో బెంగళూరులో ఆమ్నెస్టీ కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. అప్పుడు ఆర్థిక నేరాల పేరుతో ఆమ్నెస్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. అయితే కోర్టు జోక్యంతో మళ్లీ వాటిని పునరుద్ధరించుకోగలిగారని అమ్నెస్టీ తెలిపింది.


2019లో తమకు చిన్నపాటి విరాళాలు ఇచ్చే దాతల్లో కొన్ని డజన్ల మందికి ఆదాయ పన్ను విభాగం నుంచి లేఖలు వెళ్లాయని ఆమ్నెస్టీ చెప్పింది. అదే ఏడాది చివర్లో అమ్నెస్టీ కార్యాలయాలపై సీబీఐ దాడులు చేసి సోదాలు నిర్వహించింది. ఈసారి కేంద్ర హోం మంత్రిత్వశాఖ నమోదు చేసిన కేసులో ఈ దాడులు జరిగాయి.

READ  అవిభక్త కవలల స్కూటర్ రైడింగ్ అదుర్స్..! వీడియో వైరల్

Related Posts