Home » నీ శ్రమకు సలాం: ఒంటి కాలితో పనిచేస్తున్న నిర్మాణ కార్మికుడు
Published
3 months agoon
By
subhnనిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న ఆ వ్యక్తికి ఉంది ఒక కాలు మాత్రమే. క్రచ్ సాయంతో క్లిష్టమైన టాస్క్‌ను సులువుగా చేసేస్తున్నాడా వ్యక్తి(Amputee man). ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కు చెందిన సుశాంత నందా అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్టు చేశారు.
సోమవారం 15సెకన్ల నిడివి ఉన్న వీడియోను పోస్టు చేయడంతో 13వేల మంది దానిని చూశారు. కేవలం రియాక్ట్ అయి వదిలేయడం కాదు. ఇన్స్పిరేషన్ తీసుకునేలా ఉంది ఆ వీడియో.
నిర్మాణ దశలో ఉన్న స్థలంలో ఓ వ్యక్తి.. క్రచ్ సాయంతో బ్యాలెన్స్ చేసుకుంటూ.. మట్టిని ఓ పరికరం ద్వారా లేపి కార్ట్ లో వేస్తున్నాడు. ఒకసారి శ్వాస తీసుకుని వంగి పనిచేసుకుని మళ్లీ లేచిన తర్వాతనే ఊపిరి పీల్చుకుంటున్నాడు.
అతని ప్రస్తుత సామర్థ్యానికి మించి కష్టపడుతున్నాడు. ఆ పోస్టుకు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నందా రెస్టెక్ట్ ఇవ్వాల్సిన వ్యక్తి అంటూ క్యాప్షన్ తో పోస్టు చేశారు. 2 వేల మంది దానికి లైక్ కొట్టగా 400మంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు. నెటిజన్లు కామెంట్ల రూపంలో అతనిని పొగిడేస్తున్నారు.
Respect 🙏 pic.twitter.com/JV74wmUn9H
— Susanta Nanda IFS (@susantananda3) October 5, 2020
స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటే.. మనమేదైనా సాధించగలం అని ఓ యూజర్ రాశాడు. మరో యూజర్ కొందరికీ బతకడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందోనని రాశాడు.