మహిళపై గ్యాంగ్ రేప్.. కూతురితో సహా రన్నింగ్ కారులో నుంచి తోసేసిన నిందితులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

amritsar:మహిళను gang-rape చేయడంతో పాటు రన్నింగ్ లో ఉన్న కారులో నుంచి కూతురితో సహా తోసేశారు. ఆమె ఒక్కరే కాకుండా పదేళ్ల బిడ్డను కూడా హింసించారు. ఈ ఘటన సెప్టెంబరు 6న జరిగింది. ఆ రోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. కొలీగ్ కు యాక్సిడెంట్ అయిందని వెంటనే రావాలని చెప్పడంతో..

కంగారుపడిన మహిళ బస్ లో అమృత్‌సర్‌కు బయల్దేరింది. చేరుకున్న వెంటనే ఫోన్ చేసిన వ్యక్తి ఆమెను కలిసి డ్రగ్స్ కలిపిన కూల్ డ్రింక్ తాగమంటూ ఆఫర్ చేశారు. మత్తులోకి జారుకోవడంతో ఆమెను బిడ్డతో సహా కారులో హోటల్ కు తీసుకెళ్లారు. ఆ సమయంలో అప్పటికే ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్నారని మహిళ చెప్పింది.ఆ తర్వాత ఆమెను గ్యాంగ్ రేప్ చేశారని బాధిత మహిళ చెప్పింది. కాసేపటి తర్వాత మహిళతో పాటు బిడ్డను కారులో నుంచి తోసేశారు. ఈ ఘటనతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఆమె మోచేతికి తీవ్రంగా గాయమైంది. భయంతో విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండిపోయానని మహిళ చెప్పింది. ఆ తర్వాత భయం కూడదీసుకుని పోలీసుల దగ్గరకు వెళ్లింది.

నిందితులను కచ్చితంగా శిక్షించాలని మహిళ చెప్పింది. రికార్డులను చెక్ చేయడంతో పాటు, హోటల్ సీసీటీవీ పరిశీలించి బాధితురాలిపై రేప్ జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Related Tags :

Related Posts :