Home » విశాఖలో వాలంటీర్ పై ప్రేమోన్మాది దాడి..యువతిని కత్తితో పొడిచిన దుండగుడు
Published
2 months agoon
By
bheemrajassailant attack young woman : విశాఖలో మరో ప్రేమోన్మాద దాడి జరిగింది. వన్‌టౌన్‌లోని ఫెర్రీవీధిలో వాలంటీర్ అయిన ఓ యువతిపై శ్రీకాంత్ అనే మరో వాలంటీర్ కత్తితో దాడి చేశాడు. యువతిని మెడపై కత్తితో పొడిచిన శ్రీకాంత్ అనంతరం తానూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
స్థానికులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. యువతి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. యువతి మరో వ్యక్తితో చనువుగా ఉంటోందన్న అనుమానంతో శ్రీకాంత్ దాడి చేసినట్టు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో రక్తమోడిన రహదారులు..వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి
యువతిపై శ్రీకాంత్ పాశవికంగా దాడి చేశాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. యువతిని నిర్ధాక్షిణ్యంగా పొడిచిన శ్రీకాంత్…తాను కత్తితో చిన్న గాయం చేసుకుని, రక్తస్రావం కాకుండా మెడకు టవల్ చుట్టుకున్నాడని తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో యువతి మెట్లమీద పడిపోయిందని విలపించారు.