లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

కోవిడ్ నయమైనా..తల్లిని ఇంట్లోకి రానివ్వని చదువుకున్న కొడుకు

Published

on

కరోనా మానవత్వాన్ని చంపేస్తోంది. పేగు బంధాన్ని దూరం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకొనేలా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నవమాసాలు మోసి..కని పెంచిన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు.కరోనా సోకి కోలుకున్న తల్లి ఇంటికి వచ్చేసరికి తాళం కనపించింది. వైరస్ సోకిందనే కారణంతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు కొడుకు, కోడలు. నిజామాబాద్ జిల్లాలోని రోటరీనగర్ లో చోటు చేసుకుంది.బాలమణి మహిళ కొడుకు, కోడలితో నివాసం ఉంటోంది. విద్యుత్ శాఖలో AE గా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం బాలమణికి కరోనా సోకింది. దీంతో కొడుకు జిల్లా ఆసుపత్రిలో చేరిపించారు. వారం రోజుల క్రితం పరీక్షలు నిర్వహంచగా..నెగటివ్ వచ్చింది. తల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు కొడుకుకు సూచించారు.అయినా..స్పందించలేదు. ఆసుపత్రి వర్గాలు ఇంటి వద్ద దింపేశారు. తల్లిని ఇంట్లోకి రానివ్వలేదు. ఇంటి తాళం వేసుకుని భార్య, పిల్లలతో వెళ్లిపోయాడు. ఎవరి దగ్గర వెళ్లలేక..తనలో తాను కుమిలిపోతూ..ఇంటి ఆవరణలోనే ఉండిపోయింది. చదువుకున్న కొడుకే ఈ విధంగా చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *