లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

బెయిల్ ఇస్తే.. రేప్ చేసిన మైనర్‌ను పెళ్లాడతానంటోన్న మాజీ మత గురువు

Published

on

కేరళలోని మాజీ క్యాథలిక్ మత ప్రభోదకుడు శిక్ష తగ్గించుకునేందుకు కొత్త నిర్ణయం తీసుకున్నాడు. మైనర్ ను రేప్ చేసి గర్భవతిని చేయడంతో యావజ్జీవ ఖైదుకు గురైన మత గురువు.. బెయిల్ ఇస్తే ఆ బాలికను పెళ్లాడి ఆమెకు పుట్టిన బిడ్డకు సంరక్షకుడిగా ఉంటానని చెప్తున్నాడు.

రాబిన్ వడక్కుంచెరీ (54) ఫిబ్రవరి 2017న అరెస్టు అయ్యాడు. 2016వ సంవత్సరంలో పలు మార్లు మైనర్ బాలికను రేప్ చేశాడని నిరూపితమైంది. తాను మత ప్రభోదకుడిగా ఉన్న చర్చికి స్కూల్ పక్కపక్కనే ఉండడంతో శారీరకంగా లోబరచుకుని అత్యాచారం చేశాడు. కడుపులో నొప్పిగా ఉందంటూ హాస్పిటల్ కు వెళ్లిన బాలికకు 2017 ఫిబ్రవరి 7న మగబిడ్డ జన్మించాడు.

విచారణ జరిగి 2019 ఫిబ్రవరి 17న వడక్కుంచేరీని నేరస్థుడిగా పరిగణిస్తూ.. 20ఏళ్ల జైలు శిక్ష రూ.2లక్షల జరిమానా విధించింది చిల్డ్రన్ అండ్ సెక్సువల్ అఫెన్సెస్ (పొక్సో) కోర్టు. ఈ వారం ఆ మాజీ మత గురువు కేరళ హైకోర్టును ఆశ్రయించి బెయిల్ కావాలని అడిగాడు. రెండు నెలల పాటు శిక్షను తప్పిస్తే 20ఏళ్ల వయస్సు వచ్చిన బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు.

గమనించాల్సిన విషయమేమిటంటే ఈ పిటిషన్ కు బాధితురాలి పేరెంట్స్ కూడా సంతకం చేశారు. ఆ బిడ్డకు సంరక్షకుడిగా ఉంటానని తాత్కాలికంగా శిక్షను తప్పించాలని అడుగుతున్నాడు. పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డను అనాథశ్రమానికి తరలించింది చెల్డ్ వెల్ఫేర్ కమిటీ.

అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చి పేరెంటల్ కేర్ లో ఉంచుకుంటానని వడక్కుంచేరీ పిటిషన్ లో తెలిపాడు. బాధితురాలిని తాను ప్రేమించానని ఫ్యామిలీ లైఫ్ గడపాలనుకుంటున్నానని వివరించాడు. బెయిల్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత కొందరు యాక్టివిస్ట్ లు జీవిత ఖైదు నుంచి తప్పించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ ఆరోపిస్తున్నారు.

‘రేప్ చేసిన ప్రతి నేరస్థుడు బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని చెప్తారు. అలాంటి వారిని అస్సలు సహించం’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుమన్ చక్రవర్తి అంటున్నారు. బాలికకు సీక్రెట్ గా డెలివరీ చేయించిన పేరెంట్స్.. తర్వాత విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చెప్పేశారు. 2017లో పాపకు జన్మనిచ్చిన తర్వాత బాధితురాలి తండ్రి తన కూతురు రేప్ కు గురైందని మాత్రమే చెప్పాడు. పోలీసుల ఎంక్వైరీలో తర్వాత ఆ మాజీ మత గురువు చెప్పుకొచ్చాడు.

2018లో బాధితురాలు మత గురువుకు అనుకూలంగానే మాట్లాడింది. ఇష్ట ప్రకారమే సెక్స్ జరిగిందని చెప్పింది. తర్వాత పలువురు సాక్ష్యాలు చెప్పడంతో వడక్కుంచేరీ మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చాడు. కానీ దానిని కొట్టిపారేసిన కోర్టు పుట్టిన బిడ్డకు డీఎన్ఏ టెస్టు నిర్వహించి మైనర్ ను రేప్ చేసినట్లుగా నిర్థారించింది. అతనిని నేరస్థుడిగా పరిగణిస్తూ పోప్ కూడా వడక్కుంచేరీని మత గురువు హోదా నుంచి తొలగించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *