లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

చాక్లెట్ల ఆశజూపి చిన్నారులపై 15 రోజులుగా లైంగిక దాడి

Published

on

SEXUAL HARRASMENT

నిజామాబాద్‌ జిల్లాలో ఓ వృద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. చాక్లెట్ల ఆశజూపి ఇద్దరు బాలికలపై 15 రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. బాధిత కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నారాయణ(50) ఇంటి పక్కన గల వేర్వేరు కుటుంబాలకు చెందిన ఎనిమిదేండ్ల వయస్సు గల ఇద్దరు చిన్నారులను చాక్లెట్లు కొనిస్తానని చెప్పి సమీపంలోని ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి వారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

ఈవిధంగా 15 రోజులుగా వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. వీరిలో ఒకరికి కడుపునొప్పి వస్తుందని శనివారం ఓ బాలిక తల్లికి చెప్పింది. సాధారణ కడుపునొప్పి అనుకుని తల్లి ఊరుకున్నది. ఆదివారం సాయంత్రం సమయంలో మళ్లీ వృద్ధుడు బాలికకు చాక్లెట్ల ఆశ చూపి తీసుకెళ్తుండగా.. అనుమానం వచ్చి సదరు బాలిక తల్లి స్థానికుల సాయంతో అనుసరించింది. బాలికపై వృద్ధుడి దాష్టీకాన్ని గమనించి.. పట్టుకుని అతన్ని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు.

ఎడపల్లి ఎస్సై సిబ్బందితో అక్కడి చేరుకుని బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తనతోపాటు మరో బాలికను తీసుకెళ్తాడని చెప్పడంతో ఇరు కుటుంబాల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. నారాయణను అదుపులోకి తీసుకొని ఎడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Read Here>>హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో రాయల్ బెంగాల్ టైగర్ మృతి

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *