పాయల్ కొత్త కోణం.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Anaganaga O Athidhi Trailer: తెలుగు ఓటీటీ‘ఆహా’ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో దయాల్ పద్మనాభన్ తెరకెక్కించిన పీరియాడిక్ థ్రిల్లర్.. ‘అనగనగా ఓ అతిథి’.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేశారు.


కష్టాల్లో ఉన్న ఓ కుటుంబంలోకి అనుకోని అతిథి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తమ బాగుకోసం అతిథిని ఆ కుటుంబం బలి తీసుకుందా అనే ఆసక్తి రేకెత్తించింది ట్రైలర్. పాయల్ సరికొత్త క్యారెక్టర్లో ఆకట్టుకోనుందనిపిస్తోంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి.


నవంబర్ 20 నుండి ఆహా లో ‘అనగనగా ఓ అతిథి’ స్ట్రీమింగ్ కానుంది. డైలాగ్స్ : కాశీ నడింపల్లి, లిరిక్స్ : కళ్యాణ్ చక్రవర్తి, మ్యూజిక్ : అరోల్ కొరెల్లి, డీఓపీ : రాకేష్ బి, ఎడిటర్స్ : బాబు ఎ శ్రీవాత్సవ.

Related Tags :

Related Posts :