Anand Mahindra says lockdown extensions could be economically disastrous

లాక్‌డౌన్ పొడిగించడం వల్ల ప్రయోజనం లేదు: ఆనంద్ మహీంద్రా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అసలే నష్టాల్లో ఉన్న భారతీయ ఆటో పరిశ్రమ కరోనా కారణంగా అతిపెద్ద సవాలును ఎదుర్కొంటోంది. తక్కువ స్థాయిలో డిమాండ్.. సరఫరా తగ్గడం కారణంగా ఆర్థికంగా ఆటో ఇండస్ట్రీ దెబ్బతింది.

ఇటువంటి పరిస్థితుల్లో కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మరోమారు కనుక పొడిగిస్తే ఆర్థిక వినాశనం తప్పదని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా హెచ్చరించారు. 

లాక్డౌన్లను విస్తరించే ఆలోచనకు వ్యతిరేకంగా ఆనంద్ మహీంద్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి నిర్ణయాలు ఆర్థికంగా వినాశకరమైనవి అవుతాయని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోమారు లాక్‌డౌన్ పొడిగింపు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ట్వీట్ చేశారు.

అంతేకాదు, లాక్‌డౌన్ పొడిగింపు వల్ల వైద్యపరమైన సంక్షోభం కూడా తలెత్తే అవకాశం ఉందని, లాక్‌డౌన్‌ను పొడిగిస్తే ప్రజల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అన్నారు.

Read: దేశవ్యాప్తంగా జూలైలో స్కూళ్లు ప్రారంభం, మార్గదర్శకాలు ఇవే

Related Posts