లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ఇండియన్ క్రికెటర్లకు ఆనంద్ మహీంద్రా కార్ల గిఫ్ట్

Published

on

Anand Mahindra:ఆస్ట్రేలియా చారిత్రక విజయం నమోదు చేసుకున్న టీమిండియాకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. శనివారం ఆనంద్ మహీంద్రా ఈ ఆస్ట్రేలియా సిరీస్ లో అరంగ్రేట్ మ్యాచ్ ఆడిన ప్లేయర్లకు ఎస్యూవీ గిఫ్ట్ గా ఇస్తానని ట్వీట్ లో వెల్లడించారు. దీనిని బట్టి చూస్తే మొహమ్మద్ సిరాజ్, శుబ్ మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్ కు అందేలా ఉన్నాయి.

టీమిండియాలో ఐదుగురు ప్లేయర్లు గాయాల కారణంగా ఆడకుండా ఉండిపోవడంతో శార్దూల్ కు రెండో టెస్టు నుంచి ఆడే అవకాశం దక్కింది.

‘ఇటీవల జరిగిన చారిత్రక సిరీస్ విజయంలో ఆరుగురు క్రికెటర్లు అరంగ్రేట సిరీస్ ఆడారు. వారంతా భవిష్యత్ జనరేషన్ల కలలు సాకారం చేసుకునేందుకు ప్రేరణగా నిలిచారు. అవి నిజమైన జీవిత గాథలు. ఎక్సెలెన్స్ కు ఉదాహారణగా నిలిచాయి. జీవితంలో ప్రతి ఘట్టానికి ఇన్ స్పిరేషన్ అయ్యారు.

ఇది నాకు పర్సనల్ గా చాలా గొప్పగా అనిపించింది. అందుకే నూతనంగా సిరీస్ లో ఆడిన వారందరికీ న్యూ థార్ ఎస్యూవీని నా సొంత ఖర్చుతో గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నా. దీనికి కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ గిఫ్ట్ ఇవ్వడానికి కారణం యువత తమను తాము నమ్ముకుని, బాట పట్టాలని’ అనుకుంటున్నా అని రాసుకొచ్చారు.

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. బ్రిస్బేన్ లో తిరుగులేని కంగారూలను 33ఏళ్ల తర్వాత ఓడించింది రహానెసేన. నాలుగో టెస్టులో చాకచక్యంగా ఆడి మూడు వికెట్ల తేడాతో గెలవడమే కాకుండా టెస్టు సిరీస్ ను గెలిచింది. ఇదే వేదికగా 1988లో ఓడిపోయిన ఆసీస్.. ఇన్నేళ్లుగా ఓటమి ఎరుగకుండా దూసుకెళ్లింది. 2018-19లో కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసిన టీమిండియాకు రెండో విజయానికి కాస్త టైం పట్టింది.