Home » అనసూయ కోలీవుడ్ ఎంట్రీ.. ఆ నటి పాత్రలో!
Published
1 month agoon
By
sekharAnasuya Bharadwaj Kollywood Entry: బుల్లితెర మీద స్టార్ యాంకర్‌గా రాణిస్తూ.. క్యారెక్టర్ నచ్చితే వెండితెరపై కూడా సత్తా చాటుతోంది అనసూయ. ‘రంగస్థలం’ లో రంగమ్మత్తగా ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘క్షణం’ వంటి సినిమాల్లో అలరించింది. ఇప్పడు తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది. అది కూడా వెర్సటైల్ యాక్టర్, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి సినిమా కావడం విశేషం.
మొన్న విజయ్ సేతుపతితో కలిసి తీసుకున్న పిక్ షేర్ చేసిన అనసూయ తాజాగా షూటింగ్ కోసం మేకప్ వేసుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆమె విజయ్ సేతుపతి సినిమాలో కీలక పాత్ర చేస్తోందని సమాచారం.
అనసూయ మిర్రర్లో మేకప్‌తో కనిపిస్తున్న తీరు చూస్తుంటే సీనియర్ నటి సిల్క్ స్మితలా ఉందని, తమిళ్ మూవీలో ఆమె క్యారెక్టరే అనసూయ చేస్తోందని సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. తెలుగులో సత్తా చాటిన అనసూయ తమిళ తంబీలను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.