Home » గర్భవతి క్యారెక్టర్లో అనసూయ!
Published
2 months agoon
By
sekharAnasuya’s Thank You Brother: పాపులర్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా.. ‘థ్యాంక్ యు బ్రదర్!’..
జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రరెడ్డి, తారక్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. రమేష్ రాపర్తి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల ఈ మూవీ టైటిల్ లుక్‌ని రానా దగ్గుబాటి రివీల్ చేయగా.. శుక్రవారం ఫస్ట్ లుక్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేశారు. తేజ్ ‘విన్నర్’ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.ప్రియ, అభి పాత్రల్లో అనసూయ, అశ్విన్ నటిస్తున్నారు. ఈ మూవీలో అనసూయ గర్భవతిగా కనిపించనుంది.
ఇటువంటి ఛాలెంజింగ్ రోల్లో ఆమె ఆడియెన్స్‌ను ఆకట్టుకుందని కొత్తగా చెప్పక్కర్లేదు. ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఆదర్శ్ బాలకృష్ణ, అనీష్ కురువిల్లా, హర్ష ఇతర పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకి సురేష్ రగుతు సినిమాటోగ్రఫి, గుణా బాలసుబ్రమణియన్ మ్యూజిక్ అందిస్తున్నారు.