విష్ణుప్రియ యోగా క్లాస్: ఇలా చేయండి.. అనుభూతిని ఆస్వాదించండి..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లాక్‌డౌన్ వల్ల టీవీ, సినిమా షూటింగ్స్ ఆగిపోవడంతో  సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తమకి నచ్చిన పనులు చేస్తూ.. ఇంటి సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. వర్కౌట్స్ నుంచి వంట చేయడం వరకు అన్ని పనుల తాలూకు వీడియోలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవల పాపులర్ యాంకర్ విష్ణు ప్రియ పోస్ట్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ఏ స్థాయిలో వైరల్ అయిందో తెలిసిందే. బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలతో ఆకట్టుకునే విష్ణు ప్రియకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.


తాజాగా విష్ణు ప్రియ షేర్ చేసిన యోగా వీడియో ఒకటి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. యోగా ద్వారా కలిగే ప్రయోజనాల గురించి రాసి ఆమె పోస్ట్ చేసిన వీడియో చూసి కుర్రకారు షాక్ అయ్యారు. ‘అయ్య బాబోయ్ విష్ణు ప్రియా.. యోగా ఇంత అందంగా ఉంటదా.. ఇంత అందంగా యోగా చేస్తారా?’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ‘విష్ణు ప్రియలో ఇంత టాలెంట్ ఉందా’.. ‘తెలుగమ్మాయి టాలెంట్‌ని గుర్తించండి, ఎంకరేజ్ చేయండి.. తెలుగు ఇండస్ట్రీకి ఈ టాలెంట్ అవసరం’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Related Posts