బాడీబిల్డర్ కండల్ని కరిగించేసిన కరోనా: దుక్కలా ఉండేటోడు..నక్కలాగైపోయాడు

Before and after corona causes massive weight loss in a californian bodybuilder

కండలు తిరిగిన సుమో అయినా..కండలు తిరిగిన వస్తాదులైనా ‘‘ఐ డోంట్ కేర్’’ అంటోంది కరోనా. నాకెవ్వరైనా ఒక్కటే..వచ్చానంటే ఎగరేసుకుపోతా..లేదా ఏనుగులా ఉండేటోడిని కూడా పీనుగులా చేసిపోతానంటూ వార్నింగ్ లిస్తోంది. జాగ్రత్తగా ఉండకపోతే ఫలితం అనుభవించకతప్పదంటోంది. ఎంతోమందికి కరోనా సోకుతున్న క్రమంలో  కండలు తిరిగిన బాడీ బిల్డర్  కరోనా బారిన పడ్డాడు. బతికి బైటపడ్డాడు. కానీ పాపం కండలు మాత్రం కరిగిపోయాడు. దుక్కలా ఉండేటోడు నక్కలాగైపోయినాడు. 

అమెరికాకు చెందిన మైక్ షుల్జ్ అనే బాడీబిల్డర్ కూడా కొన్నివారాల కిందట కరోనా బారినపడ్డాడు. కాలిఫోర్నియాకు చెందిన షుల్జ్ కరోనా రక్కసితో  6 వారాల పాటు పోరాడి విజయం సాధించాడు. కానీ..పాపం అతని కండలు మాత్రం..ఎండలో పెట్టిన  ఐస్ క్రీముల్లా కరిగిపోయాయి. ఎంతగా అంటే ఏకంగా 23 కిలోల బరువు కోల్పోయాడు మైక్. అతడికి చికిత్స అందించిన ఆసుపత్రిలోని ఓ నర్సు అతని తాజా ఫొటోలను పోస్టు చేయడంతో అతని ఫాలోవర్లు విస్తుపోయారు. మైక్..ఎలా ఎండేటోడివి ఎలాగైపోయావ్..పోనిలే బతికుంటే కండలు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు..కరోనాను కాలరాసి బతికి బైటపడ్డావ్..అంతేచాల అంటున్నారు.

కరోనా సోకకముందు 86 కిలోల బరువున్న షుల్జ్ కరోనా నుంచి కోలుకున్నాక 63 కిలోల బరువుకి తగ్గిపోయాడు. దీనిపై సదరు బాడీబిల్డర్ వ్యాఖ్యానిస్తూ, ఈ ఫొటోలను తాను ప్రదర్శించడానికి కారణం, కరోనా ఎవరికైనా సోకుతుందని చెప్పడానికేనని..దయచేసినఎవ్వరూ అజాగ్రత్తగా ఉండొద్దుఅని సూచించాడు.

అంతేగా మరి..ప్రభుత్వాలకు పేద గొప్పా తేడా ఉంటుంది కానీ..కాలనాగులాంటి కరోనాకు మాత్రం పేద గొప్పా..బక్కగా ఉన్నారా??కండలు తిరిగి ఉన్నారా? అని కూడా చూడదు..జాగ్రత్తగా లేకుండా వచ్చి అమాంతం మీద పడిపోతుందంతే..

Read: దా..దా.. ICC చైర్మన్ రేసులో ముందున్న సౌరవ్ గంగూలీ

మరిన్ని తాజా వార్తలు