రథంలో సింహాలు మాయం : దుర్గమ్మ చూస్తూ ఊరుకుంటుందా ? శిక్షిస్తుందా ?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Bejawada దుర్గమ్మ గుడిలో ఏం జరుగుతోంది. రథానికి ఉన్న విగ్రహాలు మాయం కావడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎలా మాయమయ్యానే చర్చ జరుగుతోంది. ఏపీ రాష్ట్రంలో ఆలయాల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలు మానవ తప్పిదమా ? ఇందులో కుట్ర కోణం దాగి ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.దేవుడి రథాలతో ఆటలా ? అమ్మవారి వాహనంతోనే చెలగాటమాడుతారా అంటున్నారు. ఇంద్రకీలాద్రిపై వరుస వివాదాలు చోటు చేసుకుంటుండడం అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అప్పట్లో క్షుద్రపూజలు కలకలం రేపితే..ఇప్పుడు రథం సింహాలు మాయం కావడం చర్చనీయాంశమయ్యాయి.

ఆ ఏనుగులకు గంజాయి ఇస్తున్నారు.. ఎందుకో తెలుసా?


అమ్మవారి ముక్కుపుడక మాయం కావడం, దుర్గమ్మ సన్నిధిలో క్షుద్రపూజలు చేయడం కలకలం రేపాయి. ఏడాదికిపైగా రథాన్ని వాడకపోవడం వల్లే..అనర్థం జరిగిందా ? ఇది చేసింది ఇంటి దొంగల పనా ? ప్రొఫెషనల్స్ క్రిమినల్స్ చేశారా ? ప్రత్యేక సెక్యూర్టీ ఉన్నా చోరీ ఎలా జరిగింది ? సీసీ కెమెరాలున్నా అంతటి సాహాసానికి ఎలా ఒడిగట్టారు ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పోరాట పంథాను ఎంచుకున్నాయి.అమ్మలుగమ్మ అమ్మ బెజవడ దుర్గమ్మ. ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మవారు అంటే..భక్తులు భక్తిశ్రద్ధలతో కొలుస్తుంటారు. ఆదిశక్తి అవతారం, మహిషాసుర మర్ధిని స్వరూపం. ఎన్నో శక్తులు కలిగిన అమ్మవారి ఆలయంలో జరుగుతున్న ఘోరాలను దుర్గమ్మ చూస్తూ ఊరుకుంటుందా ? శిక్షిస్తుందని అంటున్నారు కొంతమంది.

రథంపై కప్పిన కవర్లు కప్పినట్లుగానే ఉన్నాయి. కానీ రథంపై ఉన్న సింహాలు మాయం కావడం కలకలం రేపింది. ఉగాది నాడు రథంపై అమ్మవారి ఊరేగిస్తుంటారు. కానీ ఈ సంవత్సరం కరోనా కారణంగా..ఉగాది పండుగ నాడు..రథాన్ని ఉపయోగించలేదు. అంతర్వేదిలో రథం కాలిపోయిన ఘటన మరిచిపోకముందే..ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.ఆలయ ఈవో చేసిన వ్యాఖ్యలపై పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఎవరో సింహాలను దొంగిలించారని అంటున్నారు.వెండి రథంపై వెండి సింహాల మాయం ఘటన నేపథ్యంలో అధికారులు ముందుగా విచారణ జరుపుతున్నారు. ఆ తర్వాత సింహాలు కనిపించకపోతే ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.

Related Posts