ఆంధ్రా అత్తా మజాకా : అల్లుడి కోసం 67 రకాల వంటలు..చూసి ఫిదా అయిపోతున్న నెటిజన్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కొత్త అల్లుడు వస్తున్నాడంటే చాలు అత్తగారికి ఎక్కడ లేని హడావిడి. ఎందుకంటే కొత్త అల్లుడికి ఏమేమి వంటలు చేసినపెట్టాలాని ఆలోచిస్తుంది. అందులోను ఆ అత్త ఆంధ్రా అత్త అయితే వచ్చే కొత్త అల్లుడు అత్తగారు వండి పెట్టేలెక్కలేనన్ని వంటలకు సన్నగా పీలగా ఉన్నవాడు కాస్తా..బొద్దుగా ముద్దుగా తయారవ్వాల్సిందే. ఈ క్రమంలో కొత్త అల్లుడికి ఓ ఆంధ్రాఅత్తగారు ఏకంగా 67 రకాల వెరైటీ వెరైటీ వంటలు వండి పెట్టేసింది. అవన్నీ ఆ అల్లుడు తింటాడా లేదా అనేది పక్కన పెడితే..ఈ అత్తగారు చేసిన వంటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆంధ్రావాళ్లకు మర్యాదలెక్కువ అనేమాట ఉండనే ఉంది. పొద్దున్నే వచ్చినా..అర్థరాత్రి వచ్చినా చుట్టాలకు వండి పెట్టటం అంటే ఆంధ్రావారికి ఎంతోఇష్టం. కొసరి కొసరి వడ్డిస్తారు. తినేవాడికి పొట్టా నిండుతుంది మనస్సూ నిండుతుంది. అది ఆంధ్రా సంప్రదాయం. అటువంటిది కొత్త అల్లుడి వస్తేఇక ఇంటిలో పిండి వంటలు ఘుమఘుమలాడాల్సిందే. అలా వచ్చిన కొత్త అల్లుడి కోసం ఓ ఆంధ్రా అత్తగారు వండిన 67 రకాల పిండి వంటలు హాట్ టాపిక్ గా మారాయి.

భర్త వచ్చిన సంతోషంతో కూతురు చక్కగా ముస్తాబైతే..అల్లుడికి ఏమేమి వంటలు ఇష్టం కూతుర్ని అడిగా మరీ అల్లుడికి ఇష్టమైన వంటలను రెడీ చెయ్యాలని ఉబలాటపడుతుంది అత్తగారు.. అటు మరదళ్లు, ఇటు బావమరదులు కొసరి కొసరి వడ్డించడంతో అల్లుడు లావెక్కక్కపోతే సన్నబడతాడా ఏంటి?

ఇక విషయంలోకి వస్తే..ఓఆంధ్రా అత్త అల్లుడి కోసం ఏకంగా 67 రకాల వంటలు సిద్ధం చేసింది. అనంత్ రూపంగుడి అనే అనే ట్విటర్ యూజర్ ఈ అత్త వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

67 రకాల ఆహారాలను అల్లుడి కోసం రెడీ చేసింది. ‘ఏంటి అన్ని వంటలే.. తింటాడా అతను? తింటే రెండు రోజుల్లో పొట్ట రావడం ఖాయం’ అని అనిపిస్తోంది కదూ. కేకు కటింగ్ నుంచి మొదలుపెడితే చాట్, స్వీట్లు, బజ్జీలు, పులుసు, వడియాలు, లడ్డూలు, రొట్టె.. ఇలా చెప్పుకుంటూపోతే 67 రకాల వంటలు అవి. ఆమె ఈ వీడియోలో ఒక్కో వంటకం, వెరైటీల గురించి చక్కగా వివరించింది. వింటుంటూ..చూస్తుంటే నోరు ఊరిపోతోంది.

కానీ అన్నేసి తినలేం అనిపిస్తోంది కదూ. అందుకే ఈ అత్తమ్మ ఐదు పూటలు అని అంటోంది. ‘మీ చేతి వంట ఎంత రుచిగా ఉంటే మాత్రం అన్నేసి అల్లుడు తింటాడా? భుక్తాయాసం వచ్చి ఏమన్నా అవగలదేమో జాగ్రత్త’ అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. ‘మీక మదర్-ఇన్-లా ఆఫ్ ఇండియా అని అవార్డ్ ఇవ్వాల్సిందే. ఇంత మంచి అత్తలు అల్లుళ్లకు దొరకడం ఏ జన్మ పుణ్యమే’ అని మరొకరు జోక్ వేశారు.ప్యాట్రిక్ బ్రూక్‌మ్యాన్ అనే యూజర్ అయితే.. ‘నేను వచ్చే జన్మలో భారతీయ అల్లుడిగా పుడతాను’ అని తెలిపాడు.

Related Posts