లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

అసెంబ్లీలో గందరగోళం : ఆవేశంతో ఊగిపోతూ బైఠాయించిన చంద్రబాబు

Published

on

Assembly winter session

andhra pradesh assembly : ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారపక్ష సభ్యులతో వాగ్వాదానికి దిగారు. అరుపులు, కేకలతో సభ దద్ధరిల్లింది. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై టీడీపీ సంతృప్తి చెందలేదు. వ్యవసాయ రంగంపై చర్చ కావాలని టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ అంశంపై చర్చ జరుగుతుండగానే..టీడీపీ వాకౌట్ చేయడం గమనార్హం. తర్వాత..పంట నష్టం వివరాలపై ప్రతిపక్ష, అధికారపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.పోడియం ముందు చంద్రబాబు, టీడీపీ సభ్యులు బైఠాయించారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 15 నాటికి పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని తెలిపిన సీఎం జగన్…చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన రౌడీయిజం చేస్తున్నారంటూ వెల్లడించారు. సభను పక్కదోవ పట్టించాలని టీడీపీ చూస్తోందని, రైతుల పట్ల టీడీపీ కపట ప్రేమ చూపిస్తోంది టీడీపీయేనని దుయ్యబట్టారు వైసీపీ సభ్యుడు పార్థసారధి. వాస్తవాలు బయటపడుతాయని భయపడుతున్నారని, వ్యవసాయం దండగ అని ఆనాడు చంద్రబాబు అనలేదా అనే విషయాన్ని గుర్తు చేశారాయన.టీడీపీ హాయాంలో రైతులపై కాల్పులు జరిపారని సభలో వెల్లడించారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు రైతులను అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు.శీతాకాల అసెంబ్లీ సమావేశాలు 2020, నవంబర్ 30వ తేదీ సోమవారం నుంచి స్టార్ట్ అయ్యాయి. మొత్తం 20 అంశాల పై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రెడీ చేసింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *