లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

బాబుకు షాక్: రాజధాని అంశంలో కేంద్రం పాత్ర లేదు – ఏపీ హైకోర్టులో కేంద్రం కౌంటర్ అఫిడవిట్

Published

on

ఏపీ రాజధాని అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందా ? రాష్ట్ర పరిధిలోకి వస్తుందా ? అనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. దీనిపై ఏపీ హైకోర్టులో 2020, ఆగస్టు 06వ తేదీ గురువారం కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని నిర్ణయం ఎవరి పరిధిలోకి వస్తుందనే అనే అంశంపై ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రాల రాజధానుల నిర్ణయం ఆయా ప్రభుత్వాల పరిధిలో అంశమని కేంద్ర హోం శాఖ తెలిపింది.రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం హోం శాఖ వెల్లడించింది. కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదంటూ..అఫిడవిట్ దాఖలు చేసింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ…కోర్టుల్లో న్యాయసమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

గతంలో అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులు ప్రతిపాదిస్తూ..రెండు చట్టాలను చేసిందనే విషయాన్ని గుర్తు చేసింది. ఆ చట్టాల ప్రకారం మూడు రాజధానుు ఉంటాయని ప్రభుత్వం తెలిపిందని వెల్లడించింది.దీంతో రాజధాని అంశంపై కేంద్ర పాత్ర ఉండదని అధికారికంగా చెప్పడంతో..ఓ క్లారిటీ వచ్చేసినట్లేనంటున్నారు. అమరావతిని రాజధానిగా చేస్తూ..గత ప్రభుత్వం కేంద్రానికి తెలియచేసిందనే సంగతి తెలిసిందే. కానీ..అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రభుత్వం..మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చింది.

కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఇటీవలే ఎంపీ సుజనా చౌదరితో పాటు ఇతర నేతలు వ్యాఖ్యలు చేయడం, దీనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. రాజధాని విషయంలో బీజేపీ నేతలు భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. తాజాగా దీనిపై కేంద్రం స్పష్టత ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *