లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

హాట్ హీట్ : ఏపీ అసెంబ్లీ ఫస్ట్ డే

Published

on

AP Assembly

Andhra Pradesh Winter Assembly : ఏపీ అసెంబ్లీ తొలిరోజే వాడీవేడిగా మొదలైంది. మొదటి రోజు సంతాప తీర్మానం తర్వాత బీఏసీ సమావేశం జరిగింది.. అనంతరం పలు బిల్లుల్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వ్యవసాయ రంగంపై చర్చ జరిగింది. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. రైతులకు ఉచితంగా బోర్లు, మోటార్లు, పైపులు ఇస్తున్నామన్నారు. పంటల కొనుగోలుకు 3 వేల200 కోట్లు కేటాయించామని వెల్లడించారు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. మంత్రి తర్వాత టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు చర్చలో మాట్లాడారు. రైతుల సమస్యల్ని ప్రస్తావించారు..



పంట నష్టపోయినవారిని ఆదుకోవాలన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్, మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. మంత్రి సమాధానం ఇచ్చినా రామానాయుడు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. టీడీపీ అవగాహన లేకుండా మాట్లాడుతుందని.. డిసెంబర్ నెలాఖరు నాటికి ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. నెల రోజుల్లోనే ఇన్‌పుట్ సబ్సిడీ అందించే కార్యక్రమం చేస్తున్నామన్నారు. బుర్ర వాడాలంటూ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ-వైఎస్సార్‌సీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. రామానాయుడిపై సీఎం చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఎమ్మెల్యేలతో వెళ్లి స్పీకర్ పోడియం దగ్గర బైఠాయించారు. టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు మాట్లాడుతుంటే చంద్రబాబుకు ఎలా అవకాశం ఇస్తారని వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది.



ఆ తర్వాత.. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సహా టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. స్పీకర్ పదే పదే టీడీపీ సభ్యుల్ని తమ సీట్లలోకి వెళ్లాలని కోరినా వెనక్కు తగ్గలేదు.. దీంతో ప్రతిపక్ష సభ్యుల్ని ఒక రోజు సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారంటూ సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నట్టు పేర్నినాని తీర్మానం ప్రవేశపెట్టారు.. స్పీకర్‌ తమ్మినేని ఆ తీర్మానాన్ని ఆమోదించారు.. సభ నుంచి వెళ్లిపోవాలని టీడీపీ సభ్యులకు సూచించారు.



అసెంబ్లీ నుంచి తమ సభ్యులను సస్పెండ్ చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.. సభలోనే ఉండి నిరసన వ్యక్తం చేశారు. సస్పెండ్ అయిన తర్వాత కూడా టీడీపీ సభ్యులు అక్కడే బైఠాయించారు. వారిని వెళ్లిపోవాలంటూ మార్షల్స్ వారిని కోరారు. అయితే, అందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. దీంతో… వారిని మార్షల్స్ సాయంతో బయటకు పంపించారు. మరోవైపు.. సస్పెండ్ అయిన టీడీపీ సభ్యుల అసెంబ్లీ ఆవరణలో ధర్నా నిర్వహించారు. వీడియోలు తీసేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నించడంతో మార్షల్స్‌ అడ్డుకున్నారు… దీంతో టీడీపీ సభ్యులు మార్షల్స్‌ వాగ్వాదానికి దిగారు.



బాబు నిరసనపై మంత్రులు పేర్నినాని, కన్నబాబు, ఎమ్మెల్యేలు సెటైర్లు వేశారు.. తమ అనుకూల మీడియాలో ప్రచారం కోసమే ఈ నిరసనలు చేస్తున్నారంటూ విమర్శించారు.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే నేత.. ఇంత దిగజారి ప్రవర్తించడం దారుణమన్నారు.. రేపటి వార్తపత్రికల్లో రైతులకు ప్రభుత్వం చేసే మేలు కాకుండా.. వారి ఆందోళనలను హైలెట్‌ చేసుకోవడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ కన్నబాబు విమర్శించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *