కరోనా ముందస్తు జాగ్రత్త : నోట్లను కుక్కర్ లో వేసి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రాకాసి ప్రబలుతూనే ఉంది. ఎంతో మందిని చనిపోతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున

కరోనా ముందస్తు జాగ్రత్త : నోట్లను కుక్కర్ లో వేసి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రాకాసి ప్రబలుతూనే ఉంది. ఎంతో మందిని చనిపోతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ వైరస్ ఎలా వ్యాపిస్తుందనేది తెలియడం లేదు. వైరస్ సోకిన వారు ముట్టిన వస్తువులపై కరోనా వైరస్ ఉంటుందని, ఈ వస్తువులను ముట్టిన వారికి వైరస్ సోకుతుందనే ప్రచారం జరిగింది.

దీంతో చేతులు శుభ్రంగా కడుక్కొంటున్నారు. ఏపీలో కరెన్సీ (నోట్ల) ద్వారా విస్తరిస్తుందని తెలిసింది. చాలా మంది నోట్లను ముట్టుకోవడానికి భయపడుతున్నారు. ఓ వ్యక్తి…వినూత్నంగా ఆలోచించాడు. నోట్లను కుక్కర్ లో వేసి..ఉడకపెట్టాడు. తొలుత ఈ ప్రయత్నం బెడిసి కొట్టింది. తర్వాత సక్సెస్ అయ్యాడు.

కృష్ణా జిల్లా కైకలూరులో విజయలక్ష్మీ జనరల్ స్టోర్స్ ను నరసింహరావు నిర్వహిస్తున్నాడు. ఇతని దుకాణంలో గల్లాపెట్టే స్థానంలో ఎలక్రిక్ కుక్కర్ పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. వచ్చిన డబ్బులను కుక్కర్ లో వేస్తున్నాడు. ఇది చూసిన వారంతా నోరెళ్లబెట్టారు. కుక్కర్ లో నీటి ఆవిరిలో ఉడికించి.. శానిటైజ్ చేస్తున్నారాయన. డబ్బుల నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తుందని విన్నట్లు, దీంతో తాను ఈ ఆలోచన చేసినట్లు తెలిపారాయన.

మొదట్లో కరెన్సీ నోట్లను నేరుగా కుక్కర్ ఉంచితే..కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంచెం నీటిని అడుగున పోసి..మధ్యలో రంధ్రాలున్న ప్లేటును అమర్చినట్లు వెల్లడించారు. దీంతో తన ప్రయోగం సక్సెస్ అయ్యిందన్నారు. ఆవిరిలో ఉడకబెట్టడం వల్ల వైరస్ క్రిములు చనిపోతామని నరసింహరావు తెలిపారు.