ముక్క లేదు : చికెన్, మటన్ షాపులు బంద్..వెలవెలబోతున్న రాంనగర్ పిష్ మార్కెట్ 

వీకండ్ రాగానే..ముందుగా గుర్తుకొచ్చేది..చికెన్, మటన్. ఇతర మాంస పదార్థాలు. తెచ్చుకోవడానికి ఉదయమే బయటకు వెళుతుంటారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్నా..చాలా మంది..దుకాణాలకు ఎగబడుతున్నారు. చాలా చోట్ల సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. ఎవరికి కరోనా ఉందో..ఎంత మందికి వ్యాపిస్తుందో అనే భయం నెలకొనేది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

మాంసం, చేపల దుకాణాలు బంద్ చేస్తే బెటర్ అని నిర్ణయం తీసుకున్నారు. 2020, ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం విజయవాడలో మాంసం, చేపల దుకాణాలను బంద్ చేయించారు. కరోనా విస్తరిస్తుండడంతో జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంతో పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ కొంతమంది డోంట్ కేర్ అని దుకాణాలు తీశారు. వీరిపై కొరడా ఝలిపించారు.

విజయవాడ వన్ టౌన్ లో మాంసం, చేపలను విక్రయిస్తున్న వారిని అరెస్టు చేశారు. మాంసం, చేపలు, రొయ్యలు అమ్ముతుండడంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విజయవాడ నగరం మొత్తం రెడ్ జోన్ లోనే ఉంది. కరోనా వైరస్ విస్తరించకుండా..కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.

అటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఫేమస్ అయిన రాం నగర్ పిష్ మార్కెట్ వెలవెలబోతోంది. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్నా..కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. ప్రధానంగా ఆదివారం మాంసాహారం విక్రయించే..దుకాణాలకు ఎగబడుతున్నారు. దీంతో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2020, ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం ఉదయమే..రాంనగర్ ఫిష్ మార్కెట్ కు పోలీసులు చేరుకున్నారు. చేపలు విక్రయించకుండా చర్యలు తీసుకున్నారు. విక్రయించేందుకు పోలీసులు అనుమతినివ్వలేదు.