విజయవాడలో కొంపముంచిన హౌసీ, పేకాట, విందులు

విజయవాడలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో... అధికారులు కరోనా నియంత్రణపై దృష్టి సారించారు. మొదట్లో కృష్ణలంకకు చెందిన పానీపూరి వ్యాపారితో కొంతమందికి వైరస్‌ సోకినట్టు భావించారు. క

విజయవాడలో కొంపముంచిన హౌసీ, పేకాట, విందులు

విజయవాడలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో… అధికారులు కరోనా నియంత్రణపై దృష్టి సారించారు. మొదట్లో కృష్ణలంకకు చెందిన పానీపూరి వ్యాపారితో కొంతమందికి వైరస్‌ సోకినట్టు భావించారు. కాని ఇప్పుడు  ట్రక్కు డ్రైవర్ పశ్చిమ బెంగాల్ కు వెళ్ళి వచ్చి… చుట్టుప్రక్కల వారిని పోగు చేసి మరీ పేకాట ఆడారు. దాంతో 17 మందికి కరోనా పాజిటివ్ తేలింది.

అంతకుముందు ఈ ప్రాంతంలోనే పాజిటివ్ వచ్చిన మరో వ్యక్తి అరుగుల పైన అష్టాచమ్మా, హౌసీ ఆడడంతో  ఏడుగురికి కరోనా వైరస్ సోకింది. దాదాపు 40 కేసులు ఈ  ప్రాంతాల్లోనే నమోదవ్వడంతో కరోనా వైరస్ ఎటునుంచి ఎవరికి ప్రబలుతుందో అర్ధంగాక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  వైరస్‌ సోకిన వ్యక్తులు ప్రజల మధ్యనే తిరుగుతండడంతో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

విద్యాధరపురంలోని కుమ్మరిపాలెం, ఓల్డ్ ఆర్ ఆర్ పేట, రాణిగారితోట, ఖుద్దూస్ నగర్, పాయకాపురాన్ని హాట్‌స్పాట్‌ ప్రాంతాలుగా గుర్తించారు. కానూరు పంచాయితీ పరిధిలోని సనత్ నగర్‌తో పాటు కొత్తగా కార్మికనగర్, కృష్ణలంక ప్రాంతాలను కరోనా హాట్ స్పాట్ ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల ప్రజలు బయటకు రాకుండా ….డ్రోన్ల సాయంతో అధికారులు నిఘా పెట్టారు.

ఇక గ్రామీణ ప్రాంతాల ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే జిల్లాలో నూజివీడు, మచిలీపట్నం, జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మరింత ఆందళన చెందుతున్నారు. కొత్తవారిని గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుకుంటున్నప్పటికీ  26 పాజిటివ్ కేసులు నమోదవ్వడం కలవరపాటుకు గురి చేస్తోంది.  గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిఒక్కరూ కలివిడిగా ఉండడంతో మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న కోణంలో అనుమానితులను క్వారంటైన్ సెంటర్లకు, ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. ప్రతిఒక్కరూ ఇళ్ళకే పరిమితం కావాలని.. ఎవ్వరినీ కలవవద్దని, భౌతిక దూరం పాటించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కోరారు.