విద్యార్థిని ఆత్మహత్య

విద్యార్థిని ఆత్మహత్య

కరోనా లాక్ డౌన్  కారణంగా ఇంట్లోఉన్న తనతో ఫ్రెండ్స్ సరిగా మాట్లాడటంలేదనే మనస్తాపంతో రంజిత(18) అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా కలకడ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన  అంజనాదేవి మండలంలోని బాలయ్యగారి పల్లె పంచాయతీ సచివాలయంలో ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. ఆమె తన కుమార్తె రంజితను విజయవాడలోని చైతన్య కళాశాలకు చెందిన భవిష్య క్యాంపస్‌లో నీట్‌ కోచింగ్‌కు పంపింది.

లాక్‌డౌన్‌ కారణంగా  కాలేజీకి సెలవులు ఇవ్వటంతో రంజిత కాలేజీ నుంచి ఇంటికి చేరుకుంది. కలకడ చేరుకున్నాక రోజు విజయవాడ కోచింగ్ కు వచ్చిన  స్నేహితులతో ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్‌రూంలో ప్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సాయంత్రం తల్లి విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చి, చూడగా కుమార్తె మరణించి ఉండడాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. తన స్నేహితులు సరిగా మాట్లాడటం లేదనే కారణంతో మనస్తాపానికి గురై  సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోందని…విచారణలో కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.