Rats:హవ్వ : 78 బాటిళ్ల మద్యాన్ని ఎలుకలు తాగేశాయంట

పిల్లి పాలు తాగిందంటే నమ్ముతాం. కానీ అదే ఎలుకలు మద్యం తాగాయంటే నమ్మేద్దామా ? అంటే నమ్మాలి అంటున్నారు లిక్కర్ షాప్ యజమానులు. సాధారణంగా ఎలుకలు బియ్యం, పప్పులు, ఇతరత్రా ఆహార పదార్థాలు

Rats:హవ్వ : 78 బాటిళ్ల మద్యాన్ని ఎలుకలు తాగేశాయంట

Rats:పిల్లి పాలు తాగిందంటే నమ్ముతాం. కానీ అదే ఎలుకలు మద్యం తాగాయంటే నమ్మేద్దామా ? అంటే నమ్మాలి అంటున్నారు లిక్కర్ షాప్ యజమానులు. సాధారణంగా ఎలుకలు బియ్యం, పప్పులు, ఇతరత్రా ఆహార పదార్థాలు తింటాయి..కానీ ఇదేంది అని నోరెళ్లబెడుతున్నారా ? ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 78 బాటిళ్ల మద్యాన్ని తాగేశాయంట. ఇంకొంత మంది..బాటిళ్లు పెట్టే క్రమంలో కింద పడిపోయాయని చెబుతుండడంతో అధికారులు విస్తుపోయారు. రాష్ట్ర ఎక్సైజ్ ప్రోహిబేషన్ శాఖాధికారులు ప్రకాశం జిల్లా అద్దంకిలో తనిఖీలు నిర్వహించగా నమ్మశక్యం కాని సమాధానాలు చెప్పారు.

కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. మద్యం దుకాణాలకు తాళాలు పడ్డాయి. ఒక రోజు కాదు..రెండు రోజులు కాదు..ఏకంగా 30 రోజులకు పైగా మద్యం విక్రయాలు జరగడం లేదు. దీంతో చాలా మంది మందుబాబుల పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో అక్రమంగా నివాసాలకు తరలించి మద్యం బాటిళ్లను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు విమర్శలు వినిపించాయి. రూ. 5 వేల నుంచి రూ. 25 వేల వరకు వివిధ రకాల బ్రాండ్స్ ను విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదులు అందాయి. అంతేగాకుండా…అద్దంకిలో మద్యం నిల్వల్లో భారీగా తేడాలున్నట్లు గుర్తించారు. వెంటనే 35 దుకాణాల్లో తనిఖీలు చేశారు. స్టాక్ లో ఎందుకు తేడా వచ్చిందని ప్రశ్నించారు.

వైన్స్ షాప్స్ యజమానులు చెప్పిన సమాధానాలు చూసి విస్తుపోయారు. ఎలుకలు తాగాయని, లోడింగ్ చేస్తుండగా 800 బాటిళ్లు పగిలిపోయాయని చెప్పారు. దీనికి కారకులు యజమానులేనని, వారితోనే చలాన్లు కట్టించడం జరిగిందని ఉన్నతాధికారులు వెల్లడించారు.