AP Govt: ఏపీలో కొత్తగా 10 మద్యం బ్రాండ్లు.. కాకపోతే కొంచెం కాస్ట్లీ గురూ!

కొత్తగా తీసుకురానున్న ఈ బ్రాండ్లలో తమిళనాడుకు చెందిన కంపెనీల బ్రాండ్లకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. తమిళనాడుకు చెందిన ఎస్‭ఎన్‭జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థతో పాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు ఈ అనుమతులు ఇచ్చారు. వైయస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం నుంచి రాష్ట్రంలోని అనేక కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇస్తూ వస్తున్నారు

AP Govt: ఏపీలో కొత్తగా 10 మద్యం బ్రాండ్లు.. కాకపోతే కొంచెం కాస్ట్లీ గురూ!

10 new liquor brands in AP

AP Govt: ఇప్పటికే పలు కొత్త రకాల మద్యం బ్రాండ్లను తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కొత్తగా మరో 10 బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురానుంది. అంతే కాకుండా, అదే కేటగిరీలోని మిగతా బ్రాండ్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం కొన్ని కేటగిరీల బీరు ధర 200 రూపాయలుగా ఉంది. ఇప్పుడు కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ల బీరు ధర 220 రూపాయలుగా నిర్ణయించారు.

కొత్తగా తీసుకురానున్న ఈ బ్రాండ్లలో తమిళనాడుకు చెందిన కంపెనీల బ్రాండ్లకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. తమిళనాడుకు చెందిన ఎస్‭ఎన్‭జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థతో పాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు ఈ అనుమతులు ఇచ్చారు. వైయస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం నుంచి రాష్ట్రంలోని అనేక కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే 300లకు పైగా బ్రాండ్లు ఏపీఎస్‌బీసీఎల్ వద్ద నమోదై ఉన్నాయి. వీటితో పాటు తాజాగా మరో 10 కొత్త బ్రాండ్లు ఈ జాబితాలో చేరాయి.

CM Jagan Balakrishna Wishes : పరస్పరం పలకరించుకున్న సీఎం జగన్, ఎమ్మెల్యే బాలకృష్ణ