పోలవరం ప్రాజెక్టు ప్రాంగణంలో 100 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం

  • Published By: bheemraj ,Published On : November 17, 2020 / 01:54 PM IST
పోలవరం ప్రాజెక్టు ప్రాంగణంలో 100 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం

100 feet YSR statue : పోలవరం ప్రాజెక్టు ప్రాంగణంలో 100 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం (నవంబర్ 17, 2020) పోలవరంలో మంత్రి పర్యటించారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేస్తారని చెప్పారు. డిసెంబర్ 21కి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఖరీఫ్ కు గ్రావిటిలో నీరందిస్తామని చెప్పారు.



https://10tv.in/cm-jagan-release-ysr-sunna-vaddi-scheme-funds/
టీడీపీపై తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంలో పునరావాసం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.