ఎల్‌జీ పాలీమర్స్‌కు నోటీసులు.. వెంటనే రూ.50కోట్లు కట్టండి

  • Published By: vamsi ,Published On : May 8, 2020 / 09:25 AM IST
ఎల్‌జీ పాలీమర్స్‌కు నోటీసులు.. వెంటనే రూ.50కోట్లు కట్టండి

విశాఖపట్నం కెమికల్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ ఘటనలో 12మంది చనిపోగా.. వెయ్యి మందికి పైగా ఇబ్బందులు పడ్డారని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకటించింది. ఈ క్రమంలోనే కేంద్రం, ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు మరికొంతమందికి నోటీసులు జారీచేసింది.

గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన నష్టానికి గానూ వెంటనే ప్రాథమికంగా రూ.50 కోట్లు డిపాజిట్ చేయాలని ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ఎన్జీటీ ఆదేశించింది. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి మే 18వ తేదీలోపు నివేదిక సమర్పించేందుకు ఎన్‌జిటి చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం జస్టిస్ బి శేషసయానారెడ్డితో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

లైఫ్, ప్రజారోగ్యం మరియు పర్యావరణానికి ఎంతవరకు నష్టం జరిగిందనే దాని గురించి విచారణ చేపట్టిన ట్రిబ్యునల్..  గ్యాస్ లీకేజీకి ప్రభావితమైన ఆర్ఆర్ పురంలో పెద్ద ఎత్తున పశువులు, పక్షులు, చెట్లు కూడా నాశనమైనట్లు గుర్తించింది. ఈ మేరకు వివరాలు నమోదు చేసుకున్న గ్రీన్ ట్రిబ్యునల్.. విచారణకు ఆదేశించింది.

ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం కూడా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది. అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ అధ్యక్షతన ఈ కమిటీ విచారణ జరిపి నివేదికను అందిస్తుంది. ఈ కమిటీలో సభ్యుడిగా విశాఖ కలెక్టర్‌ వినయ్ చంద్‌ కూడా ఉన్నారు.

More :

*  LG Polymers Gas Leakage…వారికి సలాం కొడుతున్న ప్రజలు

విశాఖలో గ్యాస్ లీక్ ఎప్పుడేం జరిగిందంటే

LG Polymers Gas Leakage..డాక్టర్ల సూచనలు

* విశాఖలో LG Polymers Gas Leakage.. ఫేక్ వార్తలు నమ్మొద్దు