డ్రైవర్ అవతారంలో రోజా.. ఒకేసారి 1088 అంబులెన్స్‌లు రెడీ

డ్రైవర్ అవతారంలో రోజా.. ఒకేసారి 1088 అంబులెన్స్‌లు రెడీ

ఏపీ సీఎం వైఎస్ జగన్ కొత్త టెక్నాలజీతో పాటు చక్కటి ఫెసిలిటీస్ తో కూడిన అంబులెన్స్‌లను ప్రారంభించారు. 1088 అంబులెన్స్‌లను విజయవాడలో లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. అంబులెన్సులను రాష్ట్ర నలుమూలలకు తరలి వెళ్లాయి. వాహనాల్లో 676 వాహనాలు 104 కాగా.. మరో 412 వాహనాలు 108 సర్వీసులు.

నగరి పుత్తూరు పున్నమి సర్కిల్‌లో వైఎస్సార్ విగ్రహం వద్ద 108,104 అంబులెన్సు వాహనాలను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. తర్వాత ఆమె డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. స్వయంగా కాసేపటి వరకూ డ్రైవింగ్ చేసి స్థానికుల్ని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్తగా 108, 104 వాహనాలను కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారన్నారు.

ప్రభుత్వం కొత్తగా అత్యాధునిక వైద్య సేవలందించే ఈ అంబులెన్సులలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌)కు సంబంధించినవి.. 104 అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్‌ఎస్‌)తో తీర్చిదిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నాటల్‌) వైద్య సేవలందించేలా తయారు చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా, అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలోనూ సర్వీసులు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి అన్ని ప్రాంతాల్లోనూ వాహనాలను సిద్ధం చేశారు.

Read Here>>ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టులో పిటిషన్