జనసేన, బీజేపీ కలిసి అధికారం చేపడతాయి..

జనసేన, బీజేపీ కలిసి అధికారం చేపడతాయి..

10TV special interview with BJP AP state president Somuveerraju : జనసేన, బీజేపీ కలిసి రాష్ట్రంలో అధికారం చేపడతాయని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అన్నారు. చంద్రబాబుతో కలిసి పనిచేసేది లేదని స్పష్టం చేశారు. జనసేనతో బీజేపీకి 100 శాతం అవగాహన ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. 10 టివి నిర్వహించిన స్పెషల్ ఇంటర్వ్యూ కార్యక్రమంలో సోమువీర్రాజు మాట్లాడారు. రథయాత్రను కచ్చితంగా చేపడతామని చెప్పారు. తమ రథయాత్రను ఏ దృష్టితో అడ్డుకోవాలనుకుంటున్నారని ప్రశ్నించారు. తాము క్రైస్తవానికి వ్యతిరేకం కాదన్నారు. కానీ ఆ కూటములను అనుమతి ఇచ్చి తమను అడ్డుకోవడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారని నిలదీశారు. హిందుత్వానికి వ్యతిరేకంగా చర్యలు చేపడితే ప్రజలముందే ఎండగడతామని చెప్పారు.

జనసేనకు బీజేపీకి ప్రత్యేకమైన ఎజెండాలు ఉంటాయని తెలిపారు. ఉమ్మడి అంశాలపై కలిసి పనిచేస్తామని చెప్పారు. తిరుపతి ఎన్నికల తర్వాత ఏపీలో బీజేపీ, జనసేన బలపడతాయని చెప్పారు. వైసీపీతో తమకు పోటీ అన్నారు. తిరుపతిలో కచ్చితంగా మా సత్తా చూపిస్తామని చెప్పారు. ఏపీలో ప్రస్తుతం కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు. వైసీపీ, టీడీపీ కుటుంబ పార్టీలని విమర్శించారు. దానికి భిన్నమైన వాతావరణం కావాలన్నారు. చంద్రబాబు అబద్ధాలు చెబితే విమర్శించకూడదా? అన్నారు. రాజకీయ నాయకులు నిజాలే మాట్లాడాలని తెలిపారు.

అన్ని రాష్ట్రాల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ఆలోచన అన్నారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఉండదన్నారు. చంద్రబాబు ఒకటే రాజధాని అన్నారు.. జగన్ మూడు రాజధానులు అన్నారు. హైకోర్టు ఉంటే అక్కడ రాజధాని అంటారా? మూడు రాజధానులు అంటూ చర్చను లేవనెత్తారని పేర్కొన్నారు. తమకు అధికారం ఇస్తే అరు నెలల్లో అమరావతిలో రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ఎన్నికలకు ప్రభుత్వం తోడ్పాటు అందించాలన్నారు. 2018లోనే ఎన్నికలు పెట్టాల్సింది..ఎందుకు పెట్టలేదన్నారు. ఎన్నికలు పెట్టండి తాము పాల్గొంటామని తెలిపారు. గతంలో ఈసీ వ్యవహరించిన తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

ఏపీలో వనరుల ఆధారిత అభివృద్ధికి బీజేపీ, జనసేన కలిసి ముందుకు వెళ్తాయని చెప్పారు. 2024లో ఉభయుల ఆధ్వర్యంలో అధికారంలోకి రావాలన్నారు. తిరుపతి ఎన్నికలపై చర్చిస్తామని చెప్పారు. తిరుపతి ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దన్నారు. గెలుపు లక్ష్యంతో ముందుకెళ్లాలని పవన్ తో జరిగిన భేటీలో చర్చించినట్లు తెలిపారు. ఏపీని బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి ఎన్నికల్లో నెగ్గడం అనేది ఉభయపార్టీలకు ప్రధానం. అభ్యర్థులపై స్పష్టమైన విధానం ఉంది. దీనిపై స్పష్టమైన చర్చలు జరిగాయని తెలిపారు.

‘ఏపీలో ప్రతిపక్షాన్ని ప్రజలు నమ్మే స్థితిలో ఉండరు. రాబోయే రోజుల్లో టీడీపీకి మిత్రపక్షాలు లేవు. మిత్రపక్షాలు లేని టీడీపీ పాలకపక్షానికి వెళ్లడానికి అవకాశం లేదు. 2014లో బీజేపీ, జనసేన కలిసి టీడీపీ నెగ్గిచ్చాం. టీడీపీ, వైసీపీ ఒకే విధమైన ఎపిసోడ్ నడుపుతున్నాయి. జనసేన, బీజేపీ కలిసి ముందుకు వెళ్లడానికి ఏ విధమైన అడ్డంకులు లేవు. జనసేన, బీజేపీ కలిసి ఏపీలో అధికారంలోకి వస్తాయని..తమ ట్రాప్ లోకి చంద్రబాబును తీసుకొస్తాం. చంద్రబాబుతో కలవడమంటే అది ఆత్మహత్యాసదృశ్యం అవుతుంది’.

‘నాకు మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. ఆయన కమ్యూనిస్టు భావజాలంతో పనిచేశారు. పేదల కోసం సేవా చేశారని పెద్దలు చెప్తారు. నేను స్కూల్లో చదివేటప్పుడు సంఘంతో పరిచయం ఏర్పడింది. తర్వాత ఎమర్జెన్సీలో అండర్ గ్రౌండ్ లో ఉండి వర్క్ చేశాను. డిగ్రీ అయిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించాను’ అని వివరించారు.