AP Corona : ఏపీలో కొత్తగా 1,145 కరోనా కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,145 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారినపడి ఒక్క రోజులో 11 మంది చనిపోయారు.

AP Corona : ఏపీలో కొత్తగా 1,145 కరోనా కేసులు

Ap Corona

corona cases in AP : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,145 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారినపడి ఒక్క రోజులో 11 మంది చనిపోయారు. ఇవాళ 1,243 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,33,419కి చేరింది. ఇప్పటివరకు 20,04,786 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం వైరస్‌ బారినపడి 14,030 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,603 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Surgical Masks : సర్జికల్‌ మాస్కులే మంచివి, కరోనా వ్యాప్తికి చెక్

24 గంటల్లో 62,252 టెస్టులు నిర్వహించగా.. తాజాగా 1,145 కేసులు నమోదయ్యాయి. కరోనాతో కృష్ణాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, కర్నూలు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 271, చిత్తూరులో 201, కృష్ణాలో 164, గుంటూరులో 141, ప్రకాశంలో 136, పశ్చిమ గోదావరిలో 131, కడపలో 131, నెల్లూరులో 130 చొప్పున నమోదు అయ్యాయి.