12 Board Exam : పరీక్షల రద్దు, ఏపీ సర్కార్‌‌ను అభినందించిన సుప్రీం

వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం...సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో వెనక్కి తగ్గింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు అభినందించింది. పరీక్షల రద్దుపై ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని జస్టిస్ ఖన్విల్కర్ వ్యాఖ్యానించారు.

12 Board Exam : పరీక్షల రద్దు, ఏపీ సర్కార్‌‌ను అభినందించిన సుప్రీం

Ap Exams

AP Govt And Supreme Court : రాష్ట్రాల బోర్డుల పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసినట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. పరీక్షల నిర్వహణపై గురువారం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల తర్వాత రద్దుపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలోని అనేక రాష్ట్రాలు టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుచేశాయి. కేంద్రం కూడా సీబీఎస్‌ఈ సిలబస్ విద్యార్థులకు టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసింది. అయితే వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం…సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో వెనక్కి తగ్గింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు అభినందించింది.

పరీక్షల రద్దుపై ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని జస్టిస్ ఖన్విల్కర్ వ్యాఖ్యానించారు. పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నప్పటికీ…మనోభావాలు దృష్టిలో ఉంచుకుని రద్దు చేశామని ప్రభుత్వం తెలిపింది. జూలై 31లోపు ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించింది. ప్రత్యేక మార్గంలో వెళ్లాలనుకోవడం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది దుశ్వంత్ దవే సుప్రీంకోర్టుకు తెలిపారు.

సుప్రీంలో పరీక్షల విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. వాదనల సమయంలో.. పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణ అంశాన్ని 15 రోజులు ముందుగా చెబుతామన్నారని.. ఏర్పాట్లకు 15 రోజులు ఎలా సరిపోతుందని ప్రశ్నించింది. విద్యార్థులతో పాటు సిబ్బంది రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల బోర్డులు ముందే ఫలితాలను ప్రకటిస్తే ఏపీ విద్యార్ధులు నష్టపోరా అని ప్రశ్నించింది. చివరకు పరీక్షల రద్దుకు ఏపీ సర్కార్ మొగ్గు చూపింది.