గుడ్ న్యూస్, కడపలో కరోనా నుంచి కోలుకున్న 13మంది

ఏపీలో కరోనా ప్రభావం ఎక్కువున్న జిల్లాల్లో కడప ఒకటి. ఇక్కడ కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో కడన జిల్లాను హాట్‌స్పాట్‌గా కేంద్రం

  • Published By: veegamteam ,Published On : April 16, 2020 / 09:15 AM IST
గుడ్ న్యూస్, కడపలో కరోనా నుంచి కోలుకున్న 13మంది

ఏపీలో కరోనా ప్రభావం ఎక్కువున్న జిల్లాల్లో కడప ఒకటి. ఇక్కడ కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో కడన జిల్లాను హాట్‌స్పాట్‌గా కేంద్రం

ఏపీలో కరోనా ప్రభావం ఎక్కువున్న జిల్లాల్లో కడప ఒకటి. ఇక్కడ కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో కడన జిల్లాను హాట్‌స్పాట్‌గా కేంద్రం ప్రకటించింది. ఢిల్లీ ప్రభావం కడపను తీవ్రంగా వణికిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరింది. ప్రొద్దుటూరులో అత్యధికంగా 15 కేసులు నమోదు కాగా కడపలో 6, బద్వేల్‌లో 4, పులివెందులలో 4, వేంపల్లెలో 2, మైదుకూరులో 3, ఎర్రగుంట్లలో 2 కేసులు నమోదయ్యాయి. పాజిటీవ్ ఉన్న 9 ప్రాంతాలు రెడ్‌ జోన్లుగా కొనసాగుతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు.

13మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్:
కాగా కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరు కోలుకున్నారు. 13మంది కరోనా నుంచి కోలుకున్నారు. వారిని ఫాతిమా మెడికల్ కాలేజీ ఆసుపత్రి నుంచి గురువారం(ఏప్రిల్ 16,2020) డిశ్చార్జ్ అయ్యారు. 13మందికి నెగెటివ్ రావడంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన వారిని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పరామర్శించారు. వారందరికి ప్రభుత్వం తరపున ఆర్థికసాయంగా రూ.2వేలు చొప్పున అందజేశారు.

క్వారంటైన్ బాధితులకు రూ.2వేలు ఆర్థికసాయం:
కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్న జగన్ సర్కార్.. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. క్వారంటైన్ పూర్తి చేసుకున్నవారికి రూ.2వేలు ఆర్థికసాయం ఇవ్వాలని నిర్ణయించింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక పౌష్టికాహారం తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ఆర్థికసాయం ఇవ్వనుంది. అలాగే రానుపోను చార్జీల కోసం మరో రూ.600 ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ఏపీలో 534కి పెరిగిన కరోనా కేసులు:
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. గురువారం(ఏప్రిల్ 16,2020) కొత్తగా మరో 9 కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌‌లో తెలియజేశారు. వీటిలో కృష్ణా జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. ఈ 9 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 534కు పెరిగింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 20మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 14మంది చనిపోయారు.

122 కరోనా కేసులతో టాప్ లో గుంటూరు జిల్లా:
రాష్ట్రంలో కరోనా కేసుల్లో గుంటూరు జిల్లా (122) టాప్‌లో ఉంది. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదుకాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నమోదైన కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:
గుంటూరు జిల్లా -122
కర్నూలు జిల్లా – 113
నెల్లూరు జిల్లా – 58
కృష్ణా జిల్లా -48
ప్రకాశం జిల్లా – 42
కడప జిల్లా – 36
పశ్చిమ గోదావరి జిల్లా – 34
చిత్తూరు జిల్లా – 23
విశాఖపట్నం జిల్లా -20
తూర్పుగోదావరి జిల్లా – 17
అనంతపురం జిల్లా -21
మొత్తం కేసులు -534

Also Read | దక్షిణ కొరియా ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం