AP Corona : ఏపీలో కొత్తగా 1,435 కరోనా కేసులు, ఆరుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 1,435 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ సోకి ఆరుగురు మరణించారు.

AP Corona : ఏపీలో కొత్తగా 1,435 కరోనా కేసులు, ఆరుగురు మృతి

Ap Corona

corona cases in AP : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 1,435 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఆరుగురు మరణించారు. వైరస్‌ బారినపడిన వారిలో 1,695 మంది కోలుకున్నారు. ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు 20 లక్షలకుపైగా నమోదు అయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,00,038కి చేరింది. వీరిలో 19,70,864 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,472 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 13,702కు చేరింది. శుక్రవారం 69,173 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

మరోవైపు దేశంలో బ్రేక్ త్రూ ఇన్ ఫెక్లన్లు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకున్నా..ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. దేశంలో 2,60,000 బ్రేక్ త్రూ కేసులు నమోదు అయ్యాయి. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వారిలో లక్షా డెబ్బై వేల మందికి కరోనా సోకింది. రెండు డోసులు తీసుకున్న వారిలో 80,000 మంది వైరస్ బారిన పడ్డారు.

కేరళలో అత్యధికంగా బ్రేక్ త్రూ కేసులు నమోదు అయ్యాయి. కాగా కేరళలో కొత్త వేరియంట్ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి వైరస్ సోకినా తీవ్రత తక్కువగా ఉంటుందని తెలిపింది. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం, మరణాల ముప్పు ఉండదని స్పష్టం చేశారు.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్ తన రూపాలను మార్చుకుంటూ దాడి చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ముగిసిపోయిందనుకున్న తరుణంలో థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొచ్చింది. డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాలను గజ గజ విణికిస్తోంది.