AP Covid-19 : కరోనాతో నలుగురు మృతి, చిత్తూరులో అత్యధిక కేసులు

24 గంటల వ్యవధిలో 154 మందికి కరోనా సోకింది. నలుగురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గుంటూరులో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు ...

AP Covid-19 : కరోనాతో నలుగురు మృతి, చిత్తూరులో అత్యధిక కేసులు

Ap Corona Cases

Andhra Pradesh Covid-19 Cases : ఏపీ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టడం లేదు. ప్రతి రోజు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే..కేసుల సంఖ్య 150 నుంచి 200 లోపు మాత్రమే ఉంటున్నాయి. భారత్ లో ఇతర దేశాల్లో కొత్త వేరియంట్ వెలుగు చూడడంతో రాష్ట్రం అలర్ట్ అయ్యింది. పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచనలు, సలహాలు జారీ చేస్తోంది. 24 గంటల వ్యవధిలో 154 మందికి కరోనా సోకింది. నలుగురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గుంటూరులో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని పేర్కొంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.

Read More : Couple Cheated Rs.7 Cr : చిట్టీల పేరుతో రూ.7 కోట్లు మోసం

ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,70,835 పాజిటివ్ కేసులకు గాను…20,54,261 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,452 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2,122గా ఉందని తెలిపింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 30 మంది వైరస్ బారిన పడ్డారు. 30 వేల 979 శాంపిల్స్ పరీక్షించగా…154 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. గడిచిన 24 గంటల్లో 177 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,05,70, 020 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.

Read More : Ghulam Nabi Azad : రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు..కొత్త పార్టీ ఏర్పాటుపై ఆజాద్ కీలక వ్యాఖ్యలు!

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 12. చిత్తూరు 30. ఈస్ట్ గోదావరి 14. గుంటూరు 16. వైఎస్ఆర్ కడప 04. కృష్ణా 14. కర్నూలు 1. నెల్లూరు 10. ప్రకాశం 03. శ్రీకాకుళం 09. విశాఖపట్టణం 20. విజయనగరం 03. వెస్ట్ గోదావరి 18. మొత్తం : 154