రౌడీ షీటర్ బెల్ట్ మురళీ హత్య కేసులో 17మంది అరెస్ట్

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 10:45 AM IST
రౌడీ షీటర్ బెల్ట్ మురళీ హత్య కేసులో 17మంది అరెస్ట్

చిత్తూరు జిల్లా తిరుపతిలో రౌడీ షీటర్  బెల్ట్ మురళీ..అలియాస్ పసుపులేటి మురళీ హత్యకేసులో పోలీసులు 17మందిని అరెస్ట్ చేశారు.  వీరిలో ఆరుగురు తమినాడు రాష్ట్రానికి చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. రౌడీ షీటర్ ను హత్య చేయటానికి రూ.4లక్షలు సుపారీ తీసుకున్నారు ముఠా. చిత్తూరు జిల్లా 2018 డిసెంబర్ 21న బెల్డ్ మురళీ అనే రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 18మంది నిందితుల్లో 17మందిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావు భూపాల్ వెల్లడించారు. 

నిందితుల్ని అరెస్ట్ చేసిన ఎస్పీ మాట్లాడుతూ..2017లో జరిగిన భార్గవ్ హత్య కేసులో బెల్ట్ మురళీ  నిందితుడుగా ఉన్నాడని..దీంతో భార్గవ్ స్నేహితులు మురళీని హత్య చేసారని ఎస్పీ తెలిపారు. బెల్ట్ మురళీని హత్య చేయటనాకి తమిళనాడుకు చెందిన ఐదుగురు ముఠా సభ్యులతో భార్గవ్ స్నేహితులు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. మురళీని హత్య చేయటానికి సదరు ముఠాకు రూ.4లక్షలు సుపారీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు.

గత కొంతకాలం క్రితం అంటే డిసెంబర్ నెలలో బెల్ట్ మురళీ భార్గవ్ స్నేహితులైన మల్లిఖార్జున, నర్శింహుల్ని బెదిరించాడు.దీంతో తమను కూడా మురళీ చంపేస్తాడనే భయంతో మురళీని తామే చంపిచేయాలని ప్లాన్ వేశారు. దీంట్లో భాగంగానే తమిళనాడు ముఠాలకు సుపారీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారు.  

దీనికి సంబంధించి బుజ్జల గజేంద్ర అనే వ్యక్తి ఇంట్లో సమావేశమైన మల్లిఖార్జున, నర్శింహులుతో పాటు మరికొంతమంది మురళీ హత్యకు ప్లాన్ వేశారు. వీరిలో దినేష్ అనే వ్యక్తికి తమిళనాడులో స్నేహితులున్నారు. వారిలో కొంతమంది పాతనేరస్థులుగా ఉన్నారు. వారిని తీసుకొచ్చి మురళీని హత్య చేయిద్దామని ప్లాన్ వేశారు. దీంట్లో భాగంగానే సదరు తమిళనాడు ముఠాను తీసుకొచ్చి రూ.4లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. 

అనంతరం ఈ ముఠా డిసెంబర్ 21న తిరుపతిలోని పట్టణంలోని లీలామహల్ సెంటర్ ఎస్ కే పాస్ట్ వద్ద మురళిని గుర్తు తెలియని దుండగులు అతికిరాతకంగా నరికి చంపారు. కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో మురళి అక్కడికక్కడే కప్పకూలాడు. నడిరోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కత్తి పట్టిన వాడు కత్తికే బలవుతాడన్నది బెల్డ్ మురళీ హత్యతో మరోసారి నిజమైంది.