Korukonda Ganja Seized : తూర్పుగోదావరి జిల్లాలో రూ.5 కోట్ల విలువైన గంజాయి సీజ్

తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి కలకలం రేపుతోంది. మరోసారి పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. కోరుకొండలో సుమారు 1800 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. దీని విలువ సుమారు రూ.5కోట్లు ఉంటుందని తెలిపారు.(Korukonda Ganja Seized)

Korukonda Ganja Seized : తూర్పుగోదావరి జిల్లాలో రూ.5 కోట్ల విలువైన గంజాయి సీజ్

Ganja Seized

Korukonda Ganja Seized : తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఏజెన్సీ మారేడుమిల్లి నుంచి రాజమండ్రి వైపు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సుమారు 1800 కేజీల గంజాయిని సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.5కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోరుకొండ నార్త్ జోన్ సర్కిల్ పరిధిలో ఇప్పటికి సుమారు రూ.6 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 1800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రాజమహేంద్రవరం పోలీసులు తెలిపారు. గంజాయి రవాణ గురించి పక్కా సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో కోట్ల విలువ చేసే గంజాయి పట్టుబడటం కలకలం రేపుతోంది.

Ganja Seized : భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత

కోరుకొండలో మరోసారి భారీగా గంజాయి చిక్కడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల సుమారు 750 కేజీల గంజాయిని పట్టుకున్న సంగతి తెలిసిందే. శనివారం రెండోసారి సుమారు 1800 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమూరుకు చెందిన రఘువీర్‌ రాయ్‌, అతని భార్య ప్రశాంతి రాయ్‌ కారులోనూ, షేక్‌ బుజ్జి, నాజిర్‌ వ్యాన్‌లోనూ గంజాయిని తరలిస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి కొంతమూరుకు తరలిస్తుండగా ప్రధాన రహదారిలో పశ్చిమగోనగూడెం వద్ద పోలీసులు పట్టుకున్నారు. ముందస్తుగా వచ్చిన సమాచారంతో సిబ్బందిని అప్రమత్తం చేసి తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు. కారులో రెండు, వ్యానులో 50 గంజాయి సంచులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కారు, వ్యాను జప్తు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

Ganja Smuggling : దోశ అనుకున్నారా ?…కాదండీ…గంజాయి కొత్త అమ్మకాలు

అటు.. అనంతగిరి మండలం ఎన్‌ఆర్‌పురం రహదారిలో శనివారం తెల్లవారుజామున గంజాయిని రోడ్డు పక్కన పడేసి, దాన్ని తరలిస్తున్న వాహనాన్ని రోడ్డుకి అడ్డంగా వదిలేసి దుండగులు పరారయ్యారు. ఎన్‌ఆర్‌పురం గ్రామానికి సుమారు కిలోమీటర్ దూరంలో రోడ్డుకి ఇరువైపుల సుమారుగా 32 బస్తాల గంజాయిని పడేశారు. దీని విలువ 50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. గంజాయిని అక్రమంగా తరలించేందుకు ఉపయోగించిన వాహనాన్ని రోడ్డు మధ్యలో వదిలేసి స్మగ్లర్లు పరారయ్యారని పోలీసులు తెలిపారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

మన్యం నుంచి మైదానానికి కారులో తరలిస్తున్న 50 కేజీల గంజాయిని జోగుంపేట దరి ఉగ్గంపేట కూడలిలో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొయ్యూరు మండలం చిట్టెంపాడు రోడ్డులో వస్తున్న కారును సిబ్బంది ఆపి తనిఖీ చేయగా 5 కిలోల బరువున్న పది ప్యాకెట్లు బయటపడ్డాయన్నారు. నిందితులు రాజస్తాన్‌కు చెందిన నైనా సింగ్‌, నాథూరామ్‌, ప్రతాప్‌ సింగ్‌గా గుర్తించినట్లు చెప్పారు.

పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. గంజాయి అక్రమ రవాణ మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో గంజాయి పట్టుబడుతోంది. దీంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. గంజాయి పెంపకం చేసే వారిపై, అక్రమ రవాణపై మరింత ఫోకస్ పెట్టారు.