క్రైమ్ డేటా విడుదల…తెలంగాణలో తగ్గిన నేరాలు

  • Published By: venkaiahnaidu ,Published On : October 22, 2019 / 11:55 AM IST
క్రైమ్ డేటా విడుదల…తెలంగాణలో తగ్గిన నేరాలు

ఎట్టకేలకు 2017 ఏడాదికి క్రైమ్ డేటాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) విడుదల చేసింది. ఏడాది ఆలస్యంగా NCRB ఈ డేటాను విడుదల చేసింది. అయితే మూకదాడులు,ఖాప్ పంచాయితీలు ఆదేశించిన హత్యలు,ప్రభావిత వ్యక్తులు పాల్పడిన హత్యల వివరాలను సేకరించినప్పటికీ రిలీజ్ చేసిన ఫైనల్ రిపోర్ట్ లో ఎన్‌సిఆర్‌బి తెలుపలేదు. వాటికి సంబంధించి వివరాలు ఆ రిపోర్ట్ లో పేర్కోలేదు. NCRB విడుదల చేసిన డేటా ప్రకారం…2017 సంవత్సరంలో నమోదైన 28,653 హత్య కేసులతో హత్య కేసుల సంఖ్య 5.9 శాతం క్షీణించిందని, ఇది 2016 లో 30,450 కు తగ్గిందని ఎన్‌సిఆర్‌బి డేటా వెల్లడించింది. డేటా ప్రకారం వివాదాలతో దారి తీసిన మర్డర్లు (7,898 కేసులు), తర్వాత “వ్యక్తిగత కక్ష్యసాధింపు లేదా శత్రుత్వం(4,660 కేసులు),లాభం కోసం చేసిన మర్డర్లు (2,103 కేసులు)ఉన్నాయి.

2016తో పోల్చితే 2017లో దేశ రాజధానిలో ఢిల్లీలో నేరాల సంఖ్య బాగా పెరిగింది.11శాతం నేరాలు పెరిగాయి. 2017లో కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలోకెల్లా నేరాల సంఖ్యలో ఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. రాష్ట్రాల విషయానికొస్తే గుజరాత్(6.7)కేరళ(13.1),మధ్యప్రదేశ్(7.6),మహారాష్ట్ర(9.3),తమిళనాడు(8.4),ఉత్తరప్రదేశ్(12)శాతంలో ఢిల్లీ కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసులలో ఢిల్లీలోనే 4.9శాతం(2లక్షలకు పైగా కేసులు)నమోదయ్యాయి. మొత్తం 2లక్షల 44వేల 714 కేసులు నమోదవగా,2లక్షల 32వేల 66కేసులు ఐపీసీ కింద నమోదవగా,12వేల 648 స్సెషల్ అండ్ లోకల్ లా(SLL) కింద నమోదయ్యాయి.

2017లో దేశవ్యాప్తంగా మొత్తం 50లక్షలకు పైగా విచారించదగ్గ నేరాలు నమోదయ్యాయి. 2016తో పోల్చితే 3.6శాతం పెరిగింది. 61.2శాతం ఐపీసీ సెక్షన్ల కింద నమోదవ్వగా,38.8శాతం ప్రత్యేక,స్థానిక చట్టాలు(SLL)కింద నమోదయ్యాయి. 2016తో పోల్చితే ఐపీసీ కేసులు 2.9శాతం,SLL కేసులె 4.8శాతం పెరిగాయి. అయితే మర్డర్ కేసులలో మాత్రం 2016తో పోల్చితే 2017లో 6శాతం తగ్గాయి. 2016లో 30వేల450 మర్డర్ కేసులు నమోదవగా,2017లో 28వేల 653 కేసులు నమోదయ్యాయి. డేటా ప్రకారం వివాదాలతో దారి తీసిన మర్డర్లు (7,898 కేసులు), తర్వాత “వ్యక్తిగత కక్ష్యసాధింపు లేదా శత్రుత్వం(4,660 కేసులు),లాభం కోసం చేసిన మర్డర్లు (2,103 కేసులు)ఉన్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే…తెలంగాణ బాలిక-స్నేహపూర్వక రాష్ట్రంగా రిపోర్ట్ ను బట్టి అర్థమవుతోంది. 2017లో చిన్నారులను వ్యభిచార గృహాలకు అమ్మినట్లు ఒక్క కేసు కూడా నమోదుకాలేదు.తెలుగు రాష్ట్రం దేశద్రోహం, అల్లర్ల నుండి తెలంగాణ విముక్తి పొందింది. తెలంగాణలో 2017లో అల్లర్ల కేసు ఒక్కటి కూడా నమోదవ్వలేదు. మత హింస విషయంలో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. అంటే వివిధ మత, కుల లేదా జాతుల మధ్య సమాజ ఆధారిత వివాదాలను ప్రోత్సహించడానికి సంబంధించి, తెలంగాణ ఉత్తర ప్రదేశ్ తరువాత స్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్ లో 282 మత హింస కేసులు నమోదవగా తెలంగాణలో 258 నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నేరాల రేటు గణనీయంగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు మరియు ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు పెరుగుతున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి 2017 లో ఏపీలో 41 కేసులు నమోదవగా తెలంగాణలో ఇలాంటివి 25కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక హత్య కేసుల విషయానికొస్తే, తెలంగాణలో 886 కేసులు నమోదవగా,ఏపీలో  1,124 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మూడు యాసిడ్ దాడులు జరుగగా,ఏపీలో ఈ సంఖ్య తొమ్మిది. యాసిడ్ దాడుల జాబితాలో మరోసారి ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.

దేశవ్యాప్తంగామహిళలపై నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయనే దానికి నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన ఈ రిపోర్ట్ తెలియజేస్తోంది. దీని ప్రకారం 2017లో 3,59,849 కేసులు మహిళలపై నేరాలకు పాల్పడినట్లుగా రుజువులు చూపిస్తాయి. ఇవి అంతకు ముందు రెండేళ్లలో పోల్చితే పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. 2016లో 3,38,954 కేసులు నమోదవగా, 2015లో 3,29,243 నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. ఈ నేరాలు ఎక్కువగా జరుగుతున్నది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోనేనని నివేదికలో తెలిపారు. తాజాగా మొత్తం నేరాల్లో 56,011 నేరాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యాయని నివేదిక స్పష్టం చేసింది. అంటే దేశంలో జరిగే ప్రతి ఆరు నేరాల్లో ఉత్తరప్రదేశ్‌లో ఒకటని తెలియవస్తోంది. ఇక పోతే 31,979 నేరాలతో రెండవ స్థానంలో మహారాష్ట్ర ఉంది. 30,992 నేరాలతో మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్, 29,778 నాల్గవ స్థానంలో మధ్యప్రదేశ్, 25,993 ఐదవ స్థానంలో రాజస్తాన్ ఉన్నట్లు ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ తెలిపింది.