Krishna RTC: ఆర్టీసీ బస్సుల్లో 20శాతం డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఛార్జీలు.. కొత్త ధరలు ఇవే!

సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల ఆదరణ పొందేందుకు కృష్ణా జిల్లా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు.

Krishna RTC: ఆర్టీసీ బస్సుల్లో 20శాతం డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఛార్జీలు.. కొత్త ధరలు ఇవే!

Aps Rtc

Krishna RTC: సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల ఆదరణ పొందేందుకు కృష్ణా జిల్లా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రైవేట్ బస్సులు ప్రకటించినట్లుగా ఆఫర్లను ప్రకటించేందుకు సిద్ధమైంది ఆర్టీసీ. కృష్ణా జిల్లా – హైదరాబాద్ మధ్య రాకపోకల కోసం ప్రయాణికులకు చార్జీలను తగ్గించాలని నిర్ణయించింది ఆర్టీసీ. కృష్ణా జిల్లాకు చెందిన అన్ని రకాల ఎసీ బస్సుల్లో 20 శాతం చార్జీలను తగ్గించాలని నిర్ణయించింది.

ఇంద్ర, అమరావతి, గరుడ, నైట్ రైడర్, వెన్నెల స్లీపర్ బస్సుల్లో చార్జీలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్లేవారికి ఆదివారం మినహా అన్నీ రోజుల్లో చార్జీలు తగ్గించనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. హైదరాబాద్ నుంచి కృష్ణా జిల్లాకు వచ్చేవారికి శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో చార్జీలు తగ్గింపు ఉండనుంది.

విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, ఆటోనగర్ డిపోల బస్సుల్లో వెళ్లేవారికి బస్సుల్లో రాయితీ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 28 వరకు ఎసీ బస్సు చార్జీలో రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ.

గుడివాడ నుంచి BHELకు ఇంద్ర బస్సులో చార్జీ రూ.610 నుండి రూ.555కు తగ్గించింది ఆర్టీసీ. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు అమరావతి బస్సు చార్జీ రూ.650 నుంచి రూ. 535కి తగ్గించింది. ఇదే రూట్‌లో గరుడ బస్సు చార్జీని రూ.620 నుంచి రూ.495కు తగ్గించింది. వెన్నెల స్లీపర్ బస్సు చార్జీ రూ.730 నుంచి రూ.590కి తగ్గించింది.