Covid-19 : విద్యార్థులపై కరోనా పంజా.. శ్రీకాకుళంలో 23 మందికి పాజిటివ్

మూడవ దశలో కరోనా చిన్నారుల నుంచి 20 ఏళ్ల లోపు యువకులపై విజృంభించే అవకాశం ఉందంటూ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలోని వైటీసీలో శిక్షణ పొందుతున్న 23 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.

Covid-19 : విద్యార్థులపై కరోనా పంజా.. శ్రీకాకుళంలో 23 మందికి పాజిటివ్

Covid 19 Srikakulam

23 Students Infect to Covid-19 : మూడవ దశలో కరోనా చిన్నారుల నుంచి 20 ఏళ్ల లోపు యువకులపై విజృంభించే అవకాశం ఉందంటూ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలోని వైటీసీలో శిక్షణ పొందుతున్న 23 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.

ఐఐటీ, ఎన్‌ఐటీ ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలకు గిరిజన విద్యార్ధులను సన్నద్ధం చేసేందుకు ఐటీడీఏ అధికారులు గత విద్యా సంవత్సరం నుంచి సూపర్‌-60 పేరిట 120 మందికి శిఖ ప్రభుత్వ పురుషుల కళాశాల మైదానం సమీపాన గల శిక్షణ కేంద్రం(YTC)లో శిక్షణ ఇస్తున్నారు.

కరోనా కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినా వీరికి సెలవులు ఇవ్వలేదు. పలుమార్లు ఆ శాఖ ఉన్నతాధికారులకు విన్నవించడంతో గత మే నెల 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు సెలవులు ఇచ్చారు.

సెలవులు పూర్తి కావడంతో ఈనెల 2వ తేదీ నుంచి తరగతులు పునః ప్రారంభించారు. తాజాగా వీరందరికీ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 23 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. ఈ మేరకు బాధిత విద్యార్థులను పాత్రునివలస కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో ఉంచినట్లు వైటీసీ పరిపాలనాధికారి జి.రామ్మోహన్‌ తెలిపారు.