Tirumala Temple: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ: శ్రీవారి దర్శనానికి 25 గంటల సమయం

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులుతో నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి 25 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు

Tirumala Temple: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ: శ్రీవారి దర్శనానికి 25 గంటల సమయం

Ttd

Tirumala Temple: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. గత పది రోజులుగా భక్తుల రద్దీతో శ్రీవారం ఆలయం కిటకిట లాడుతుంది. ముఖ్యంగా వారాంతాల్లో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులుతో నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి 25 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేశారు. మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు..తిరుమలలో క్యూ లైన్ల వద్ద భక్తుల సౌకర్యార్ధం..ఫ్యాన్లు, కూలర్లు, కూలింగ్ టెంట్లు, చల్లటి త్రాగు నీరు అందించనున్నారు.

Also read:Minister Kottu Satyanarayana : ఆలయాల్లో భక్తులకు ఇబ్బందులు కలగొద్దు -మంత్రి కొట్టు సత్యనారాయణ

ఏయే సమయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందో అంచనా వేసి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని, భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వాలని మంత్రి కొట్టు సత్యనారాయణ టీటీడీ అధికారులను ఆదేశించారు. మరోవైపు శుక్రవారం సాయంత్ర..తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల అమర్చిన LED స్క్రీన్ పై సినిమా వీడియోలు ప్రత్యక్షం అయ్యాయి. నిత్యం స్వామి వారి కైంకర్యాలను, ఇతర సేవలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తుల కోసం ప్రదర్శిస్తుంది టీటీడీకి చెందిన SVBC ఛానల్. అయితే శుక్రవారం ఒక్కసారిగా సినిమా వీడియోలు ప్రసారం కావడంపై స్వామి వారి భక్తులు విస్మయం వ్యక్తం చేశారు.

Also read:గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకునే మార్గాలు