జగన్ రాఖీ గిఫ్ట్ : ఆగస్ట్ 15న మహిళల పేరుతో 30 లక్షల ఇళ్లపట్టాలు

  • Published By: bheemraj ,Published On : August 3, 2020 / 06:40 PM IST
జగన్ రాఖీ గిఫ్ట్ : ఆగస్ట్ 15న మహిళల పేరుతో 30 లక్షల ఇళ్లపట్టాలు

మహిళా సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అమ్మవడి నుంచి ఆసరా వరకు అన్ని పథకాలను మహిళల పేరుతో అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కోర్టు కేసుల పరిష్కారమైతే ఆగస్టు 15 వ తేదీ 30 లక్షల మందికి పైగా మహిళలకు ఇళ్ల పట్టాలిస్తామని జగన్ చెప్పారు.



తమ ప్రభుత్వం మహిళా సాధికారికతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని పునరుద్ఘాటించారు. అన్ని రంగాల్లో వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. సుమారు 30 లక్షలమంది మహిళల పేరుతో ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. తాము చేసే ప్రతి కార్యక్రమం ప్రజా సంక్షేమం కోసమేనని అన్నారు.

మ్మవడి దగ్గర నుంచి వసతి దీనెన, ఆసరా, చేయూత పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. మద్యపాన నిషేధంలో భాగంగా బెల్ట్‌ షాపులు పర్మిట్‌ రూమ్ లను పూర్తిగా తొలగించామని చెప్పారు. 33 శాతం వైన్‌షాపులను తగ్గించామని తెలిపారు.