ఏపీలో 24 గంటల్లో 377 కరోనా కేసులు, నలుగురు మృతి

ఏపీలో 24 గంటల్లో 377 కరోనా కేసులు, నలుగురు మృతి

377 corona news cases registered in AP : ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో కరోనాతో నలుగురు మరణించారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 51,420 శాంపిల్స్ ను పరీక్షించారు. కరోనా సోకి చిత్తూరు జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు, కృష్ణ జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు చొప్పున మృతి చెందారు.

గడిచిన 24 గంటల్లో 278 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 1,20,53,914 శాంపిల్స్ ను పరీక్షించారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 8,83,587కు చేరింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 7,122 మంది మరణించారు. ఏపీలో 3,038 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 8,73,427 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.