youtubeలో చూసి నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

  • Published By: nagamani ,Published On : June 6, 2020 / 05:16 AM IST
youtubeలో చూసి నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

పశ్చిమగోదావరి జిల్లాలో మరోసారి దొంగనోట్ల కలకలం రేగింది. దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠా ఆట కట్టించారు పోలీసులు. నకిలీ నోట్లు ముద్రిస్తున్న నలుగురు గ్యాంగ్ సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలు పోలీసులు  పోలీసులు  శుక్రవారం (జూన్ 5,2020)అదుపులోకి తీసుకున్నారు.వారినుంచి రూ.1.49లక్షల నగదుతో పాటు రెండు కలర్ ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు.  

జిల్లాలోని నారాయణపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు తెల్ల రంగు కాగితాలను తీసుకెళ్లి కలర్ ప్రింటర్ ద్వారా నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నారు. ఈ నగదును చిన్న చిన్న కిరాణా దుకాణాలలో మార్పిడి చేస్తున్నారు. వీరు చేస్తున్న ఈ దొంగనోట్ల పంపిణీపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఎంతో చాకచక్యగా దొంగనోట్ల ముఠాను అదుపులోకి తీసుకున్నారని ఏలూరు డీఎస్పీ దిలీప్ కుమార్ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

చేబ్రోలు సమీపంలోని నారాయణ పురం గ్రామానికి చెందిన నలుగురు ముఠాగా ఏర్పడి..యూట్యూబ్‌లో వీడియోలు చూసి తాము ఒరిజినల్ నోట్లలా ప్రింటింగ్ చేస్తున్నారనీ నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్సీ తెలిపారు. చెడు అలవాట్లకు బానిసలుగా మారని వీరు నలుగురు అక్రమ మార్గంలో సంపాదన కోసం యూట్యూబ్ లో చూసి దొంగ నోట్లను ముద్రించటం నేర్చుకున్నారనీ..వాటిని  చిన్న చిన్న దుకాణాల్లో వాటిని మార్పిడి చేస్తున్నారనీ తెలిపారు.

Read:  మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని నరికిన కొడుకు