అమరావతిలో 4, 800 గజాలు కొన్నా – పయ్యావుల

  • Published By: madhu ,Published On : January 20, 2020 / 01:04 PM IST
అమరావతిలో 4, 800 గజాలు కొన్నా – పయ్యావుల

రాజధాని అమరావతిలో తాను భూమి కొన్న విషయం వాస్తవమేనన్నారు టీడీపీ సభ్యుడు పయ్యావుల. ఎప్పుడు కొనుగోలు చేయడం జరిగిందో సభకు తెలిపారాయన. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎవరెవరు భూములు కొన్నారనే దానిపై మంత్రి బుగ్గన ఆధారాలతో సహా ఏపీ అసెంబ్లీలో వినిపించారు.

2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుని మంత్రి బొత్స సత్యనారాయణలు ప్రవేశపెట్టారు. 

దీనిపై టీడీపీ సభ్యుడు పయ్యావుల మాట్లాడారు. రాష్ట్ర రాజధాని విషయంలో 2014, సెప్టెంబర్ 01వ తేదీ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అసెంబ్లీలో చర్చ జరిగింది 2014, సెప్టెంబర్ 04వ తేదీన అన్నారు. రాష్ట్ర రాజధానిలో తనకు ఒక ఇళ్లు ఉండాలని అనుకున్నట్లు తె తెలిపారు. 13-10-2014..రాజధాని ప్రకటన అనంతరం దాదాపు 40 రోజుల అనంతరం 4 వేల 800 గజాలు కొనుగోలు చేయడం జరిగిందని వెల్లడించారు. 

Read More : పవన్ కళ్యాణ్ కదలికలపై నిఘా : జనసేన ఆఫీసు వద్ద పోలీసుల మోహరింపు